BigTV English
Advertisement

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : WWE స్టార్ గ్లెన్ జాకబ్స్ (కేన్) కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. WWE రెజ్లింగ్ పోటీల్లో ఈ ఆకారం వచ్చిందంటే అరుపులు మొదలవుతాయి. ఈ ఆకారాన్ని చూస్తేనే గుండె కిందికి జారిపోతుంది. అలాంటిది ఈ మహా బలుడు ఒక సైకో కిల్లర్ పాత్రలో బీభత్సం సృష్టించాడు. ఈ సినిమా క్షణ, క్షణం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఒక హాస్పిటల్ మార్చురీలో ఈ కథ ప్రారంభమవుతుంది. కిల్లర్ ఒక్కొక్కరిని వేటాడే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘సీ నో ఈవిల్ 2’ 2014లో విడుదలైన అమెరికన్ స్లాషర్ హారర్ ఫిల్మ్. ఈ సినిమాకి సోస్కా సిస్టర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో “కేన్” (WWE స్టార్) జాకబ్ గుడ్‌నైట్‌గా, డానియెల్ హారిస్, కాథరిన్ ఇసాబెల్, కాజ్-ఎరిక్ ఎరిక్సన్, చెలన్ సిమన్స్ నటించారు. WWE స్టూడియోస్, లయన్స్‌గేట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 17న రిలీజ్ అయింది. 2006లో వచ్చిన “సీ నో ఈవిల్” కి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. ప్రస్తుతం ట్యూబీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఈ కథ మొదటి పార్ట్ లో జాకబ్ గుడ్‌నైట్ అనే సీరియల్ కిల్లర్ బ్లాక్‌వెల్ హోటల్‌లో జరిపిన ఊచకోత తర్వాత మొదలవుతుంది. అక్కడ అతను మరణించినట్లు తెలుస్తుంది. మరో వైపు ఎమీ అనే ఒక మార్చురీ ఉద్యోగి, తన పుట్టినరోజు సందర్భంగా రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తూ, స్నేహితులతో బార్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అయితే బ్లాక్‌వెల్ హోటల్ నుండి శవాలు, జాకబ్ గుడ్‌నైట్ శవం సహా, మార్చురీకి చేరుకోవడంతో ఆమె ప్లాన్‌లు మారతాయి. ఆమె స్నేహితులు తమరా, విల్, కైలా, కార్టర్, సహోద్యోగి సేత్ మార్చురీలో ఆమెను సర్ప్రైజ్ చేయడానికి వస్తారు. అక్కడే పార్టీ జరుపుకోవాలని నిర్ణయిస్తారు. ఈ సమయంలో మార్చురీలో జాకబ్ గుడ్‌నైట్ శవం ఉండటం కథను ఉత్కంఠభరితంగా మారుస్తుంది.


ఎమీ స్నేహితురాలు తమరా, జాకబ్ గుడ్‌నైట్ శవాన్ని చూడటానికి రహస్యంగా మార్చురీ లోపలికి వెళ్తుంది. ఈ సమయంలో జాకబ్‌లో ఒక అతీంద్రియ శక్తి ఉన్నట్లు పైకి లేస్తాడు. జాకబ్ తన మతోన్మాద విశ్వాసాల ద్వారా నడిచే ఒక భీకర హంతకుడు. పాపాలు చేస్తున్న వారిని శిక్షించడానికి హత్యలు చేస్తుంటాడు. అతను హుక్స్, కత్తులు, ఇతర ఆయుధాలతో ఎమీ సమూహాన్ని ఒక్కొక్కరినీ వేటాడుతాడు. జాకబ్ బాల్యంలో తన మతోన్మాద తల్లి, అతన్ని ఈ హంతకుడిగా మార్చిందని కథలోని ఫ్లాష్‌ బ్యాక్‌ల ద్వారా తెలుస్తుంది. ఎమీ ఆమె స్నేహితులు మార్చురీ చీకటి గదులలో జాకబ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అతని హింసాత్మక స్వభావం వారిని ఆపదలో పడేస్తుంది.

ఈ కథ జాకబ్ హత్యల చుట్టూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అతను ఒక్కొక్కరినీ క్రూరంగా చంపుతూ, మార్చురీని రక్తపాతంగా మారుస్తాడు. ఎమీ, తన మెడికల్ టాలెంట్ తో జాకబ్‌ను ఎదిరించడానికి పోరాడుతుంది. ఇది ఒక తీవ్రమైన ఫైటింగ్ కి దారితీస్తుంది. కథ ఒక భయంకరమైన ముగింపుతో ముగుస్తుంది. జాకబ్‌ను ఎమీ నిలువరిస్తుందా ? అతని చేతిలో బలవుతుందా ? అనే విషయాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×