UP News: పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడ్ని విచారణ చేయడానికి వచ్చారు ఓ అధికారి. ఈ క్రమంలో ప్రశ్నలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన హెచ్ఎం, బెల్టు తీసి ఆ విచారణ అధికారిని కొట్టాడు. 5 సెకన్లలో నాలుగు దెబ్బలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలో విచారణ అధికారిని ప్రధానోపాధ్యాయుడు బెల్టుతో కొట్టడం గందరగోళం దారి తీసింది. దీనికి సంబంధించి దృశ్యాలు అధికారి రూమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆఫీసు సిబ్బంది ముందు అధికారిని హెడ్ మాష్టారు బెల్టుతో కొట్టడం యూపీలో కలకలం రేపింది. దాడికి పాల్పడిన వ్యక్తిని మహ్మదాబాద్‌లోని నద్వా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రిజేంద్ర కుమార్ వర్మ.
ప్రధాన ఉపాధ్యాయుడు బిజేంద్రకుమార్ వర్మ.. తనను వేధిస్తున్నాడని ఆ పాఠశాలకు చెందిన మరో టీచర్ విద్యాధికారికి ఫిర్యాదు చేశాడు. టీచర్ ఫిర్యాదు నేపథ్యంలో బిజేంద్రకుమార్‌కు విద్యాధికారి నోటీసులు ఇచ్చారు. అధికారి అఖిలేష్ ప్రతాప్‌సింగ్.. హెచ్ఎంను విచారణ చేస్తున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రధాన ఉపాధ్యాయుడు.
ఆ తర్వాత కోపంతో ఊగిపోయాడు. హెడ్‌మాస్టర్ చేతిలోని ఫైల్‌ను టేబుల్‌పై పెట్టాడు. ఆ తర్వాత నడుంకున్న బెల్టు తీసి విద్యా అధికారిని కొట్టాడు. 5 సెకన్లలో నాలుగు సార్లు కొట్టాడు. ఆఫీసు సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ హెచ్ఎం తన దాడిని కంటిన్యూ చేశాడు.
ALSO READ: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరగబోతోంది?
వెంటనే పోలీసులకు కాల్ చేయడానికి అధికారి ప్రయత్నించినప్పుడు హెచ్ఎం, లాక్కొని దానిని పగలగొట్టాడని ఆరోపించారు. దాడి సమయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన క్లర్క్ ప్రేమ్ శంకర్ మౌర్యపై దాడి జరిగింది. దీనికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం చివరకు ఉన్నతాధికారుల వరకు వెళ్లింది.
వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడు బిజేంద్రకుమార్ వర్మ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. విచారణకు పోలీసులు హెచ్ఎంను పిలవనున్నారు. మరి పోలీసులను ఆయన కొడతారా? అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం హెచ్ఎం పోలీసుల అదుపులో ఉన్నాడని సీతాపూర్ పోలీసులు తెలిపారు.
In Sitapur, UP, headmaster Brijendra Kumar Verma assaulted BSA Akhilesh Pratap Singh with a belt after a heated argument over a complaint. Staff intervened to rescue the BSA.
pic.twitter.com/SNIgXmx6Pp— Ghar Ke Kalesh (@gharkekalesh) September 23, 2025