BigTV English
Advertisement

Army Dog Phantom Dies: సైనికులను కాపాడి.. తన ప్రాణం విడిచింది.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ డాగ్ ఫాంటమ్ మరణం

Army Dog Phantom Dies: సైనికులను కాపాడి.. తన ప్రాణం విడిచింది.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ డాగ్ ఫాంటమ్ మరణం

Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్నూర్ సెక్టార్ లో ఆర్మీ కాన్వాయ్ పై  కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో భారత ఆర్మీకి చెందిన కుక్క ‘ఫాంటమ్’ వీర మరణం పొందింది. ఈ విషయాన్ని వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఫాంటమ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనిదని వెల్లడించింది. పలు ఆపరేషన్స్ లో ఫాంటమ్ కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ‘‘మన నిజమైన హీరో, వీర భారత ఆర్మీ డాగ్ ఫాంటమ్ అత్యున్నత త్యాగానికి మేము వందనం సమర్పిస్తున్నాం. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరచిపోలేము’’ అని వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.


సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

ఆర్మీ డాగ్ ఫాంటమ్ తాజా సెర్చ్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాదిన హతం చేసినట్లు ఆర్మీ వెల్లడించింది. అసన్ లో అఖ్నూర్ సెక్టార్ లోని దట్టమైన అడవుల్లో నక్కిన ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలను మొదట గుర్తించి ఆర్మీకి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఫాంటమ్ కన్నుమూసింది. ఈ శునకం మొత్తం తొమ్మిది ఆపరేషన్లలో పాల్గొన్నది. వీర మరణం పొందిన ఫాంటమ్ కు ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఫాంటమ్ పై త్రివర్ణ పతాకం కప్పి, పుష్ప గుచ్చం ఉంచి ఆర్మీ సిబ్బంది తుది నివాళులు అర్పించారు.


2022లో ఆర్మీలో చేరిన ఫాంటమ్

సైనిక శునకం ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినది. 25 మే 2020న జన్మించింది.  ఫాంటమ్ వయసు నాలుగేళ్లు. 2022 ఆగస్టులో ‘ఫాంటమ్’ సైనిక దళాల్లో చేరింది. అప్పటి నుంచి పలు కీలక ఆపరేషన్లలో సైనికులకు ఎంతో సాయం చేసింది. ఫాంటమ్ K9 యూనిట్‌ లో అటాకింగ్ డాగ్ విడిజన్ లో విధులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాద వ్యతిరేక, తిరుగుబాటు నియంత్రణ కార్యకలాపాలలో K9 యూనిట్‌ లో భాగస్వామ్యం అవుతున్నది. మీరట్‌ లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ ఈ శునకానికి ట్రైనింగ్ ఇవ్వగా, ఆగస్టు 12, 2022న ఆర్మీ విధుల్లోకి తీసుకున్నారు.

బట్టల్ ప్రాంతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

మరోవైపు ఆర్మీ కాన్వాయ్ మీద కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రత్యేక భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. బట్టల్ ప్రాంతంలో అసన్ ఆలయం సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించారు. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా, మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం బలగాలు గాలిస్తున్నాయి. మృతి చెందిన ఉగ్రవాది దగ్గరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల తర్వాత అసన్ ఆలయం సమీపంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

Read Also: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌‌‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం

Related News

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Big Stories

×