OG Premiers: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఓజీ(OG). గత మూడు సంవత్సరాలుగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారమవుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25వ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథంలో 24వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్లకు అనుమతి ఉన్న నేపథ్యంలో రాత్రికి 10 గంటలకు ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ఇక ఈ ప్రీమియర్లకు కూడా ఊహించని విధంగా ఆదరణ లభించింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఏ సినిమాకి లేనివిధంగా ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రసారం అవుతున్నాయి కేవలం ఒక నైజాం ఏరియాలోని(Nizam Area) 366 షోలు ప్రసారం కాబోతున్నాయి.. 366 షోస్ కూడా హౌస్ ఫుల్ బోర్డులతో కనిపించడం విశేషం. ఇలా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు నైజాం ఏరియాలోని ఈ స్థాయిలో ప్రీమియర్స్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నైజాం అంటే పవన్అడ్డా అని రికార్డులను బద్దలు కొట్టింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్లకే ఇలా ఆదరణ లభిస్తుంది అంటే ఇక సినిమాకు మంచి టాక్ వస్తే కలెక్షన్లను ఆపడం ఎవరి తరం కాదని చెప్పాలి.
గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్…
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి.. పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం తెలియగానే సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను యాక్షన్ మోడ్ లో చూడబోతున్నందుకు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నైజాం ఏరియాలో ఏ సినిమాకు లేనివిధంగా ఈ సినిమా ప్రీమియర్లుకు ఈ స్థాయిలో ఆదరణ లభించడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో స్పష్టం అవుతుంది.
పవన్ కు జోడిగా ప్రియాంక…
ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కగా సుజీత్ దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ నటించగా, శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ వంటి వారు కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన విషయం తెలిసిందే. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాలి అంటే మరి కొంత సమయం పాటు ఎదురు చూడాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా కావటం విశేషం.
Also Read: Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!