OTT Movie : ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ స్టోరీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ హాలీవుడ్ సినిమా 40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్టులకు ఆడియన్స్ అవాక్కవుతుంటారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
బ్లామ్‌క్విస్ట్ స్టాక్‌హోమ్‌లో మిల్లెనియం అనే ఒక మ్యాగజైన్‌ను నడిపే ఒక పేరున్న జర్నలిస్ట్. అతను ఒక ధనవంతమైన వ్యాపారవేత్త హాన్స్-ఎరిక్ పై రాసిన ఒక కథ వల్ల పరువు నష్టం కేసులో ఓడిపోతాడు. ఈ ఓటమి అతని కెరీర్‌ను దెబ్బతీస్తుంది. అతను ఆర్థికంగా కూడా కష్టాల్లో పడతాడు. ఈ సమయంలో హెన్రిక్ వ్యాంగ్ అనే ఒక ధనవంతుడు అతన్ని సంప్రదిస్తాడు. హెన్రిక్ తన మేనకోడలు హ్యారియెట్ వ్యాంగ్ 40 ఏళ్ళ క్రితం16 ఏళ్ల వయసులో, హెడెస్టాడ్ ద్వీపంలో జరిగిన ఫ్యామిలీ సమావేశంలో అదృశ్యమైన కేసును పరిశీలించమని కోరతాడు. హెన్రిక్‌కు, హ్యారియెట్ హత్యకు గురై ఉండవచ్చని, దీనికి వ్యాంగ్ కుటుంబంలో ఎవరో ఒకరు కారణమని అనుమానం. బ్లామ్‌క్విస్ట్ ఈ కేసును తీసుకుని హెడెస్టాడ్ ద్వీపానికి వెళ్తాడు. అక్కడ అతను హ్యారియెట్ డైరీలు, ఫోటోలు, ఇతర ఆధారాలను పరిశీలించడం ప్రారంభిస్తాడు. కానీ ఆధారాలు తక్కువగా ఉండటంతో ఈ కేసు చాలా టఫ్ గా ఉంటుంది.
మరోవైపు సలాండర్ అనే హ్యాకర్, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేస్తుంటుంది. హెన్రిక్ వ్యాంగ్ ఆమెను బ్లామ్‌క్విస్ట్ ని ఫాలో చేయడానికి నియమిస్తాడు. ఇప్పుడు బ్లామ్‌క్విస్ట్, హ్యారియెట్ ఇద్దరూ కలిసి ఈకేసు కోసం పనిచేయడం ప్రారంభిస్తారు. బ్లామ్‌క్విస్ట్, సలాండర్ కలసి హ్యారియెట్ మిస్సింగ్ గురించి లోతుగా పరిశోధిస్తారు. హ్యారియెట్ హెడెస్టాడ్ ద్వీపంలో అదృశ్యమైన రోజు, ఒక పెద్ద ఫ్యామిలీ సమావేశం జరిగింది. ద్వీపానికి ఒకే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ సమయంలో ఒక ప్రమాదం వల్ల అది కూడా మూసివేయబడింది. అంటే హ్యారియెట్ ద్వీపం నుండి బయటకు వెళ్లలేదని తెలుస్తుంది. హ్యారియెట్ డైరీలో బ్లామ్‌క్విస్ట్ కొన్ని వింత సంఖ్యలు, పేర్లను కనుగొంటాడు. ఇవి ఒక సీక్రెట్ కోడ్‌లా కనిపిస్తాయి. సలాండర్ హ్యాకింగ్ నైపుణ్యాలు ఈ కోడ్‌ను ఛేదించడంలో సహాయపడతాయి. ఇది హ్యారియెట్ మిస్సింగ్ కి సంబంధించిన ఒక రహస్యాన్ని సూచిస్తుంది. వీళ్ళు వ్యాంగ్ కుటుంబ సభ్యులను, వారి వ్యాపారాలను, గతంలోని సంఘటనలను పరిశీలిస్తారు. ఈ విచారణలో వ్యాంగ్ కుటుంబం దాచిన కొన్ని సీక్రెట్స్ ను తెలుసుకుంటారు.
వ్యాంగ్ కుటుంబం ఒక ధనవంతమైన కుటుంబం, కానీ భయంకరమైన గతాన్ని కూడా కలిగిన ఉంటుంది. బ్లామ్‌క్విస్ట్, సలాండర్ పరిశోధనలో హ్యారియెట్ మిస్సింగ్ వెనుక, ఈ కుటుంబంలో హస్తం ఉందని తెలుసుకుంటారు. వీళ్ళు ఈ రహస్యాలను ఛేదించే కొద్దీ, ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంటారు. ఎందుకంటే కొందరు కుటుంబ సభ్యులు ఈ రహస్యాలు బయటపడకుండా చేయడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. క్లైమాక్స్‌లో హ్యారియెట్ కేస్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. దీంతో కిల్లర్ ఎవరనేది తెలిసిపోతుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? కిల్లర్ ఎవరు ? ఎందుకు హ్యారియెట్ ని చంపాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ 2011లో విడుదలైన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. డేవిడ్ ఫిన్చర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, స్వీడిష్ రచయిత స్టీగ్ లార్సన్ నవల “మిల్లెనియం” సిరీస్ మొదటి భాగం ఆధారంగా రూపొందింది. ఇందుల డేనియల్ క్రెయిగ్ (మైకెల్ బ్లామ్‌క్విస్ట్), రూనీ మారా (లిస్బెత్ సలాండర్)ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2011 డిసెంబర్ 21న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హులు, ఆపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 38 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది.
Read Also : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ