IND vs BAN: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సూపర్ ఫోర్ బీకర ఫైట్ లో టీమిండియా కాస్త తడపడింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తలవంచింది. 250కి పైగా స్కోర్ చేస్తుందని అనుకున్న టీమిండియా మెడలు వచ్చింది బంగ్లాదేశ్. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా…. 168 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అలాగే గిల్ అద్భుతంగా ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. 77 పరుగుల వరకు దూకుడుగా ఆడారు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ అలాగే గిల్ ఇద్దరూ అవుట్ అయ్యారో… అప్పటినుంచి టీమిండియా పతనం మొదలైంది. నిర్విత 20 ఓవర్లలో… కేవలం 168 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
టీమిడియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో 250 కి పైగా పరుగులు చేస్తుందనుకున్న సూర్య కుమార్ యాదవ్ సేన… దారుణంగా విఫలమైంది. అభిషేక్ శర్మ అలాగే మరో ఓపెనర్ గిల్… టీమిండియా కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చారు. కానీ మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్స్ నష్టపోయిన టీమిండియా 168 పరుగులు మాత్రమే చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… అభిషేక్ శర్మ 37 బందులోనే 75 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. అలాగే మరో ఓపెనర్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు చేసి రాణించే ప్రయత్నం చేసినప్పటికీ తొందరగానే.. పెవిలియన్ చేరాడు. ఇక ఆల్రౌండర్ శివం దూబే ఇవాళ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒమన్ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా ఒక్కడే చివరి వరకు పోరాడాడు. 29 బంతుల్లో 38 పరుగులు చేసి దుమ్ము లేపాడు. తిలక్ వర్మ ఐదు పరుగులకే వెనుతిరిగాడు. అక్షర్ పటేల్ 10 పరుగులతో రాణించాడు.
ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ను దారుణంగా రన్ అవుట్ చేయించాడు సూర్య కుమార్ యాదవ్. అనవసరపు పరుగుకు పిలిచి అభిషేక్ శర్మన్ అవుట్ చేశాడు. దీంతో అప్పటి నుంచి వికెట్లు టప టపా రాలిపోయాయి. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ అయినా ఆదుకోలేకపోయాడు.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
అభిషేక్ శర్మ అలాగే గిల్ దాటికి ఇవాళ టీమిండియా స్కోర్ 250కి పైగా పోతుందని అందరూ అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్ బౌలర్లు అలాగే ఫీల్డర్స్ అద్భుతంగా రాణించారు. ఈ దెబ్బకు 168 పరుగులకే ప్యాకప్ చెప్పింది టీమిండియా. బంగ్లాదేశ్ బౌలర్లలో…. రిషద్ రెండు వికెట్లు తీయగా తంజీమ్ హసన్ సఖిబ్, ముస్తాఫిజర్ రహమాన్, మహమ్మద్ సైఫుద్దీన్ తలో వికటి తీశారు.