High Court: వివాహేతర సంబంధంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. వివాహేతర సంబంధం ఇకపై నేరం కానప్పటికీ.. సివిల్ కేసులకు సంబంధించిన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తల జీవితంలో థర్డ్ పర్సన్ జోక్యం చేసుకుంటే.. ఆ పర్సన్ పైన నష్టపరిహారం కోసం కేసు వేయొచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అంటే భర్త సెకండ్ సెటప్ పై.. భార్య కోర్టులో పరువునష్టం దావా వేయొచ్చని కోర్టు తెలిపింది.
జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ఈ తీర్పును సెప్టెంబర్ 15న వెలువరించారు. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వివాహేతర సంబంధం ఇకపై నేరం కాదని.. 2018లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో వ్యభిచారం నేరంగా పరగణించడం లేదు కానీ ఇటీవల జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివాహేతర సంబంధాలకు సివిల్ లేదా చట్టపరమైన పరిణామాల నుంచి స్వేచ్ఛను ఇవ్వదని కోర్టు తెలిపింది. వివాహేతర సంబంధం ద్వారా నష్ట పోయిన వ్యక్తి.. దీనికి గల కారణమైన మూడో వ్యక్తిపై నష్ట పరిహారం కోరవచ్చని పేర్కొంది.. ఈ కేసులు సివిల్ కోర్టులో విచారణకు రావాలని, ఫ్యామిలీ కోర్టులో కాదని కూడా స్పష్టం చేసింది.
ఈ కేసులో.. ఒక మహిళ తన భర్త బిజినెస్ లో చేరిన మరో మహిళ తన వైవాహిక జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఆరోపించింది. 2012లో వివాహం చేసుకున్న ఈ మహిళకు 2018లో కవలలు జన్మించారు. 2021లో ఆమె భర్త వ్యాపారంలో సాధారణ ఉద్యోగిగా ఓ మహిళ చేరింది. అయితే బాధిత మహిళా తన గోడును కోర్టుకు చెప్పుకుంది. తన భర్తతో సన్నిహితంగా ఉంటూ.. వైవాహిక జీవితంలో చేరి తనను ఇబ్బందులకు గురి చేసిందని తెలిపింది.
ALSO READ: Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..
ఈ విషయంలో పలు సార్లు కుటుంబం జోక్యం చేసుకున్నాక కూడా ఈ సంబంధం కొనసాగిందని పేర్కొంది. దీంతో ఆమె భర్త చివరకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో బాధిత మహిళా కోర్టులో పరువునష్టం దావా కింద కేసు వేసింది. తన వైవాహిక జీవితంలో చేరి.. తన మనోభావాలను దెబ్బతీసిందని.. జీవితం నాశనమైందని నష్టపరిహారం కోరుతూ.. ‘అలీనేషన్ ఆఫ్ అఫెక్షన్’(AoA) ఆధారంగా కేసు వేసింది.
ALSO READ: IBPS Recruitment: బిగ్ గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు
అయితే.. ప్రతివాదులు ఈ కేసు హైకోర్టులో కాకుండా ఫ్యామిలీ కోర్టులో విచారించాలని వాదించారు. అయితే, హైకోర్టు ఈ వాదనను తిరస్కరించి, అలినేషన్ ఆఫ్ అఫెక్షన్ భారతీయ చట్టంలో స్పష్టంగా గుర్తించబడినప్పటికీ.. ఇలాంటి కేసులు సివిల్ కోర్టులోనే విచారించాల్సి వస్తుందని తెలిపింది.. ఈ కేసు విచారణలో ఆ మహిళ చర్యలు నిజంగా వివాహ విచ్ఛిన్నానికి కారణమయ్యాయా అనేది నిర్ణయిస్తామని కోర్టు వివరించింది. ఈ తీర్పు భారతదేశంలో అలినేషన్ అఫ్ అపెక్షన్ ఆధారిత కేసుల అమలును పరీక్షించే మొదటి కేసు కావచ్చు.