E-Paper
Advertisement

UAE Big Ticket: సౌదీలో రూ.61 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు.. ఆ టికెట్ మనం కొనచ్చా?

UAE Big Ticket: సౌదీలో రూ.61 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు.. ఆ టికెట్ మనం కొనచ్చా?
Advertisement

UAE Big Ticket: యూఏఈలో మరో భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు రూ.61 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అబుదాబి బిగ్ టికెట్ బుధవారం తన నవంబర్ డ్రాలో విజేతను ప్రకటించింది. నవంబర్ 9న 282824 నంబర్ టికెట్ కొనుగోలు వ్యక్తికి డ్రా తగిలినట్లు ప్రకటించింది. కేరళకు చెందిన పీవీ రాజన్ గా బిగ్ టికెట్ లాటరీ గెలుచుకున్నారు. రాజన్ గత 15 సంవత్సరాలుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి రాజన్ తన 15 మంది సహోద్యోగులతో కలిసి టికెట్ కొనుగోలు చేశారు. రాజన్ సౌదీ అరేబియాలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.

పది మందికి కన్సోలేషన్ బహుమతులు

మరో పది మంది విజేతలు ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్‌ల కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. వీరిలో నలుగురు భారతీయులు టింటో జెస్మోన్, సునీల్ కుమార్, రాకేష్ కుమార్ కొడ్వానీ ఉన్నారు. వీరందరూ దుబాయ్ నివసిస్తు్న్నారు. బుధవారం జరిగిన డ్రాలో బిగ్ టికెట్ డ్రీమ్ కార్ సిరీస్ విజేతను కూడా ప్రకటించింది. నవంబర్ 17న టికెట్ (నెంబర్ 020002) కొనుగోలు చేసిన ప్రవాస బంగ్లాదేశీ మొహమ్మద్ రుబెల్ సిద్ధిక్ అహ్మద్ మసెరటి గ్రీకేల్‌ను గెలుచుకున్నారు. ఇతను అబుదాబిలో ఉంటున్నారు.

Advertisement

Also Read: Australia PM Marriage: 62 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి.. అలా చేసిన మొదటి ప్రధానిగా రికార్డు

100 మిలియన్ల దిర్హామ్ లు

అక్టోబర్‌ నెలలో 29 ఏళ్ల ప్రసాస భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లా యూఏఈ లాటరీలో తొలిసారిగా 100 మిలియన్ల దిర్హామ్‌ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఇది యూఏఈలో ఇప్పటివరకు గెలుచుకున్న అతిపెద్ద బహుమతి. యూఏఈ లాటరీ పోస్ట్ చేసిన వీడియోలో బొల్లా తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. లాటరీలో గెలుచుకున్న కొంత మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు అనిల్ తెలిపారు.

Advertisement

Disclaimer: ఈ వార్తలోని సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. రీడర్ అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాం. దీనితో బిగ్ టీవీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదు.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×