E-Paper
Advertisement

PM Modi On IndiGo Crisis : ఇండిగో సంక్షోభం.. నోరు విప్పిన ప్రధాని మోదీ, ప్రజలు ఇబ్బంది పడకూడదు

PM Modi On IndiGo Crisis :  ఇండిగో సంక్షోభం.. నోరు విప్పిన ప్రధాని మోదీ, ప్రజలు ఇబ్బంది పడకూడదు
Advertisement

PM Modi On IndiGo Crisis : ఎట్టకేలకు ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి రియాక్ట్ అయ్యారు. చట్టాలు, నిబంధనలు అనేవి వ్యవస్థలను మెరుగుపర్చడానికని అన్నారు. అంతేగానీ ప్రజలను వేధించడానికి కాదన్నారు. ఎన్డీయేపక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండిగో సంక్షోభం.. నోరు విప్పిన ప్రధాని మోదీ

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మంగళవారం ఉదయం ఎన్డీఏ ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నియమ నిబంధనలు మంచివేనని, వ్యవస్థను మెరుగుపర్చేందుకు వాటిని రూపొందించాలన్నారు. చివరకు అవి ప్రజలను వేధించకూడదన్న ఆయన మాటలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. 

Advertisement

ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రజలకు భారంగా ఉండకూడదన్నారు. దాదాపు వారం రోజులకు ఇండిగో విమాన సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతీ రోజూ వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. పైలట్ల కొరత కారణంగా ఇవాళ వందలాది విమానాలు రద్దయ్యాయి.

చట్టం ప్రజలకు భారంగా ఉండకూడదని వ్యాఖ్య

ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎప్పటివరకు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

మంగళవారం రద్దు చేయబడిన విమానాల జాబితాలు ఇలా ఉంది. హైదరాబాద్ నుండి బయలుదేరే 58 విమానాలు, బెంగళూరు నుండి 120 కి పైగా విమానాలు ఉన్నాయి. శీతాకాలం నేపథ్యంలో ఇండిగో సంస్థ కొన్ని మార్గాలను తిప్పే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సోమవారం ఒక్క రోజే ఆరు మెట్రో నగరాల విమానాశ్రయాల నుండి 560 కి పైగా విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది.

ALSO READ: పుల్లుగా తాగి ఆపై ర్యాపిడో ఎక్కిన యువతి, చివరకు ఏం జరిగింది?

ఇండిగో సంస్థలో జరిగిన పరిణామాలపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే విచారణ కమిటీని వేసింది. సమస్యకు ఐదు అంశాలు కారణమని ఇండిగో ప్రాథమికంగా వెల్లడించింది. సాంకేతిక లోపాలు, విమానాల షెడ్యూళ్లను మార్పు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన రద్దీ దీనికి కారణమని ప్రస్తావించింది. దీనికితోడు కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ఫేజ్- II రోస్టరింగ్ నియమాలు ప్రధానంగా పేర్కొంది. ప్రస్తుతం కొత్త నియమాలను కేంద్రం తాత్కాలికంగా పక్కనపెట్టింది.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×