E-Paper
Advertisement

Gujarat AAP : సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్.. గుజరాత్ లో ఆప్ కీలక నిర్ణయం..

Gujarat AAP : సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్.. గుజరాత్ లో ఆప్ కీలక నిర్ణయం..
Advertisement

Gujarat AAP : ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసినా సంచలనమే. సరికొత్త ప్రయోగాలతో దేశ రాజకీయాలనే మార్చేస్తోంది. పంజాబ్ లో చేసిన ప్రయోగమే.. గుజరాత్ లోనూ అమలు చేస్తోంది. మోదీ సొంతరాష్ట్రంలో ఇప్పటికే ఆప్ దూకుడు మీదుండగా.. తాజాగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ టీవీ యాంకర్ ను ఎంపిక చేసింది.

ఇసుధన్ గాడ్వీ.. జర్నలిస్టుగా, టీవీ షో యాంకర్. వీటీవీలో మహామంతన్ న్యూస్ షో కి హోస్ట్ గా పనిచేశారు. కీలక రాజకీయా అంశాలపై చర్చలు నిర్వహించారు.

Advertisement

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే.. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గతంగా.. సీఎం క్యాండిడేట్ గా ఎవరిని పెడుదామనే అభిప్రాయ సేకరణ జరిపారు. ఈమెయిలింగ్ పద్ధతిలో జరిగిన ఎంపికలో మొత్తం 73 శాతం మంది.. ఇసుధన్ గాడ్వీకి మద్దతు పలికారు. దీంతో గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పార్టీ తరఫున గాడ్వీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

40 ఏళ్ల గాడ్వీ ఏడాది క్రితమే ఆప్ లో చేరారు. అంతలోనే ఆయన ఏకంగా సీఎం అభ్యర్థి అవడం సంచలనంగా మారింది. విషయం తెలిసి గాడ్వీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఓబీసీ వర్గానికి చెందిన ఇసుధన్ గాడ్వీ ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో.. అసెంబ్లీ సంగ్రామం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×