E-Paper
Advertisement

Jobs: UPSCలో వెయ్యికి పైగా పోస్టులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

Jobs: UPSCలో వెయ్యికి పైగా పోస్టులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Advertisement
upsc jobs

Jobs: గవర్నమెంట్ జాబ్ అంటే ఆ లెవలే వేరు. బిందాస్ నౌకరి. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో హోదా. అందుకే సాఫ్ట్‌వేర్ జాబులకంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాలకే క్రేజ్ ఎక్కువ. అందులోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటే ఇక పండగే.

మోదీ సర్కారు ఇటీవలే భారీగా ఉద్యోగాలను భర్తీ చేసింది. లేటెస్ట్‌గా వెయ్యికిపైగా పోస్టులతో UPSC నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్‌ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Advertisement

మొత్తం 1,261 పోస్టులు. యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడిక్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నడుస్తోంది. ఏప్రిల్‌ 19న మొదలవగా.. మే 9 వరకు అప్లై చేసుకోవచ్చు.

UPSC CMS పరీక్ష తేదీ- జులై 16. దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో ఎగ్జామ్.

Advertisement

కేటగిరీ-1లో మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్‌లో 584 పోస్టులు.. కేటగిరి-2లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే) 300 పోస్టులు.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌)లో 376 పోస్టులు ఉన్నాయి.

ఆగస్టు 1, 2023 నాటికి వయస్సు 32 ఏళ్లకు మించరాదు.

అభ్యర్థులు ఎంబీబీఎస్‌ పాసై ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా అర్హులే.

యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ముందుగా ఓటీఆర్‌ చేసుకొని, ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

500 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు. ఆగస్టు 23న రిజల్ట్స్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×