BigTV English

SpaceX: స్పేస్‌ఎక్స్ క్రాష్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..

SpaceX: స్పేస్‌ఎక్స్ క్రాష్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
spacex

SpaceX: స్పేస్‌ ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌ షిప్ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. సాంకేతిక లోపంతో స్టార్‌షిప్‌ రాకెట్ గాల్లోనే పేలిపోయింది. నింగికి ఎగిసిన కాసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది. స్టార్ షిప్‌లో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.


గత సోమవారమే ఈ ప్రయోగాన్ని చేయాలనుకున్నా సూపర్ హెవీ బూస్టర్‌లో ప్రెజర్ వాల్వ్ స్తంభించినట్లు గుర్తించి చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత దాన్ని సరి చేసిన స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మరికొన్ని సాంకేతిక పరీక్షలు జరిపి, ప్రయోగానికి సిద్ధమయ్యారు. కానీ.. ప్రయోగించిన కాసేపటికే.. గాల్లోనే స్టార్‌ షిప్ పేలిపోయింది. మంటలు విరజిమ్ముతూ నేలకూలింది.

స్టార్‌షిప్ రాకెట్‌ను మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడంతో పాటు కార్గో రవాణా కోసం తయారు చేశారు. అంతేకాదు.. వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడానికి NASA చేస్తున్న ప్రయత్నాలకు.. ఈ ప్రయోగం చాలా కీలకం. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని నాసా భావించింది. కానీ.. ప్రయోగం విఫలం కావడంతో, స్పేస్‌ ఎక్స్‌తో పాటు నాసాకూ తీవ్ర నిరాశ తప్పలేదు.


స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు కాలం కలిసిరావట్లేదేమో. ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో వివాదాస్పదమయ్యారు. ఆ సమయంలో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పుడు స్టార్‌షిప్ కూడా కుప్పకూలడంతో.. మార్కెట్లో మరోసారి టెస్లా షేర్ల బ్లడ్ బాత్ తప్పకపోవచ్చు.

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×