Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ‘ముఖ్యమంత్రి మార్పు’ (CM Change) అంశం తెరపైకి వచ్చింది. కొత్త సంవత్సరం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు తప్పదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) వర్గం బలంగా వినిపిస్తోంది. తాజాగా రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని బాంబు పేల్చారు. “నూతన సంవత్సరం… కొత్త సీఎం” అంటూ డీకే శివకుమార్ వర్గం చేస్తున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆయన మాట్లాడారు. కేవలం ఊహాగానాలు కాదని, జనవరి 6వ తేదీన లేదా 9వ తేదీన కచ్చితంగా సీఎం మార్పు ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ విషయంలో తనకు వందకు వంద శాతం విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో అధిష్టానం చెరో రెండున్నరేళ్లు (2.5 Years Formula) పదవిని పంచుకోవాలనే ఒప్పందంతో సిద్దరామయ్యకు మొదట అవకాశం ఇచ్చిందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు కూడా ముగియడం, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటడంతో డీకే వర్గం నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలతో సిద్దరామయ్య వర్గంలో ఆందోళన మొదలైంది. అయితే, అధిష్టానం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా తేదీలతో సహా ప్రకటించడం చూస్తుంటే తెర వెనుక మంత్రాంగం గట్టిగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Read Also: Viral Video: పని చేయని ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్యాటరీ.. కంప్లైంట్ చేసినా పట్టించుకోపోవడంతో…