E-Paper
Advertisement

Viral Video: పని చేయని ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్యాటరీ.. కంప్లైంట్ చేసినా పట్టించుకోపోవడంతో…

Viral Video: పని చేయని ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్యాటరీ.. కంప్లైంట్ చేసినా పట్టించుకోపోవడంతో…
Advertisement

గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. రన్నింగ్ కాస్ట్ తగ్గడం, పర్యావరణహితంగా ఉండటంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకుంటున్నారు. అయితే, కొన్ని వాహనాల్లో బ్యాటరీల సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేసిన వ్యక్తికి కూడా బ్యాటరీ సమస్య తలెత్తింది. వెంటనే వెళ్లి షో రూమ్ సిబ్బందికి విషయం చెప్పాడు. ఎంతకీ తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. షో రూమ్ ముందే తన ఆటో రిక్షాను నిలబెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జరిగింది. ఈ ఘటనలో ఫిఫ్త్ రోడ్ లోని బజాజ్ షోరూమ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

సోమవారం ఓ బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో షో రూమ్ ముందు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ ఈ రిక్షా మీద పెట్రోల్ చల్లి, నిప్పు అంటించాడు. అక్కడే ఉన్న కొంత మంది ఆ ఘటనకు సంబంధించిన వీడియోను షూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డ్రైవర్ పెట్రోల్ పోసి, కొద్దిసేపటి తర్వాత ఆటోకు నిప్పంటించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. మండుతున్న ఆటో నుంచి ఎగసిపడుతున్న మంటలు ప్రయాణీకులను, వాహనదారులను భయాందోళనకు గురి చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను తగల బెట్టిన డ్రైవర్ పేరు మోహన్ అని చెప్పారు. ఆటో బ్యాటరీ పదేపదే చెడిపోతోందని, షోరూమ్ తన బాధను వినడం లేదంటూ.. కోపంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement

షోరూమ్ సిబ్బంది ఏం చెప్తున్నారంటే?

అటు ఆటోరిక్షాలో ఎటువంటి లోపం లేదని షోరూమ్ ఆపరేటర్లు వెల్లడించారు.  మోహన్ తన వాహనాన్ని 60 కిలోమీటర్లకు పైగా నడిపాడని.. ఒకేసారి అంతదూరం నడపకూడదని చెప్పినా, ఆయన అలాగే చేస్తున్నాడని బజాజ్ షోరూమ్ ఆపరేటర్ హరీష్ భండారి వెల్లడించారు. ఆటోరిక్షాలో ఎటువంటి సాంకేతిక లోపం లేదన్నారు. కంపెనీ విధానం గురించి చెప్పినా, అతడు పదే పదే కొత్త వాహనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, స్పాట్ చేరుకుని డ్రైవర్‌ ను ప్రశ్నించారు.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ బైక్ vs పెట్రోల్ బైక్.. ఏది బెస్ట్? ఎందుకంటే?

సోషల్ మీడియాలో వీడియో వైరల్  

అటు ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రస్తుతం ఈ వ్యవహారంపై  దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. అదే సమయంలో, ఏదైనా వివాదం తలెత్తినప్పుడు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే బదులు, సంబంధిత శాఖ లేదా పరిపాలనకు ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Read Also: మహీంద్రా XUV 7XO లాంచ్ డేట్ ఫిక్స్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×