E-Paper
Advertisement

Arvind Kejriwal: బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్

Arvind Kejriwal: బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో శనివారం ఢిల్లీ పోలీసులు బిభవ్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ అంశంపై కేజ్రీవాల్ స్పందించారు. బిభవ్ కుమార్ ను కుట్ర పూరింతంగానే అరెస్ట్ చేయించారంటూ ఆయన ఆరోపించారు. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అని మండిపడ్డారు. ఇదే సమయంలో బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీని అణచి వేయలేరని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే సంజయ్ సింగ్ ను జైల్లో పెట్టించిన బీజేపీ ఇప్పుడు బిభవ్ పై కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. రేపు (ఆదివారం) తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని అన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామంటూ సవాల్ విసిరారు.

మే 19న మధ్యాహ్నం 12 గంటలకు అంతా కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. మోదీ తమ నేతలను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. అందరినీ ఒకే సారి అరెస్ట్ చేయండి అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె వాంగ్మూలంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ నివాసం వద్ద ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోలను ఆప్ విడుదల చేసింది. దీనిపై స్వాతి మలివాల్ కూడా ట్విట్టర్ వేదికగా హిట్ మ్యాన్ అంటూ స్పందించారు.

అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు బిభవ్ ను అరెస్ట్ చేయగా..ఈ సంఘటనపై ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్ అని అన్నారు. పేదల కోసం మొహల్లా క్లినిక్ లు, ప్రభుత్వ పాఠశాలలు, 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించడం నేరమా.. అందుకేనా మమ్మల్ని జైల్లో వేస్తున్నారు అంటూ నిలదీశారు. ఎంత మంది ఆప్ నేతలను జైల్లో పెట్టినా.. అంతకు వంద రెట్లు ఎక్కువ మందిని దేశం తయారు చేస్తుందని అన్నారు.

 

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×