BigTV English

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. మునిగిపోయిన వాహనాలు

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. మునిగిపోయిన వాహనాలు

Heavy Rainfall in Telangana: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం చల్లబడి ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో నగరం తడిసిముద్దయ్యింది. భారీ వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. పలు చోట్లా వాహనాలు నీటమునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సంబంధింత విభాగాల సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెడుతున్నాయి.


కాగా, నగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, ఉప్పల్, ఖైరతాదాబాద్, ఓల్డ్ సిటీ, పంజాగుట్టా, మెహిదీపట్నం, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు చోట్లా భారీ వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి గా జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్లా చెట్లు విరిగిపడి రోడ్లపై పడినట్లు తెలుస్తోంది. పలు చోట్లా రోడ్లు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇంకొన్ని చోట్లా వాహనాలు నీటమునిగాయి.

అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్లా భారీ వర్షం కురిసినట్లు సమాచారం అందుతోంది. వర్షం భారీగా పడడంతో పలువురు రైతులు పంటనష్టపోయినట్లు తెలుస్తోంది.


అయితే, రాష్ట్రంలో నేడు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని, నాలుగు ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్న విషయం విధితమే.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది, అది మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నేపథ్యంలోనే ఈనెల 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో, అదేవిదంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సంబంధిత అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శుక్రవారం కూడా హైదరాబాద్ తోపాటు రాష్ట్రాంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై రాష్ట్రంలో పలువురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Also Read: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ ర్యాంక్ లు ఏపీ విద్యార్థులకే

గురువారం రోజు కూడా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయి. ఇటు రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×