BigTV English

Hero Tarun: నువ్వే కావాలి హీరో తరుణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ?

Hero Tarun: నువ్వే కావాలి హీరో తరుణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ?

Hero Tarun: సీనియర్ హీరోయిన్ రోజా రమణి గురించి ఈ జనరేషన్ వారికి తెలియకపోవచ్చు. ఆమె బాలనటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపును అందుకుంది. ఇక ఆమె నటవారసుడిగా ఆమె కుమారుడు తరుణ్ సైతం బాలనటుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పుడంటే ఆన్సర్ హీరోలను మాస్.. మాస్ అంటున్నారు. కానీ, అప్పట్లో లవర్ బాయ్ అనగానే తరుణ్ అని టక్కున చెప్పేసేవారు.


ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్ గా తరుణ్ పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది. నువ్వే కావాలి అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన తరుణ్.. నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నవ వసంతం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక 2014 లో వేట అనే సినిమా తరువాత నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చిన తరుణ్ 2018లో ఇది నా లవ్ స్టోరీ అంటూ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా తరుణ్ కు విజయాన్ని అందివ్వలేదు. దీంతో మళ్లీ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

కేవలం తరుణ్ సినిమాలు మాత్రమే చేయడం లేదు.. కానీ, సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటూ వస్తున్నాడు. దాదాపు ఆరేళ్ళ తరువాత తరుణ్ రీఎంట్రీ షురూ అయ్యింది. ఈ విషయాన్ని తరుణ్ తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “తరుణ్ రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు.మంచి కథ కోసం చూస్తున్నాడు. త్వరలోనే తరుణ్ గుడ్ న్యూస్ చెప్పనున్నాడు. కథలను తరుణ్ ఎంపిక చేసుకుంటాడు” అని చెప్పింది.


అయితే సినిమాలు కాకుండా ఇన్నేళ్లు తరుణ్ ఏం చేశాడు అంటే.. తమకు చాలా వ్యాపారాలు ఉన్నాయని, వాటిని తరుణ్ చూసుకున్నట్లు తెలిపింది. ఇక తరుణ్ కు సినిమానే కాదు క్రికెట్ అన్నా పిచ్చే. టాలీవుడ్ లో ఏ క్రికెట్ టోర్నమెంట్ జరిగినా ఈ హీరో ఉండాల్సిందే. మరి ఇన్నేళ్ల తరువాత ఈ లవర్ బాయ్ రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×