E-Paper
Advertisement

కేరళ ఫలితాలకు ముందే సంచలనం.. సీఎం హోదాను తొలగించిన పినరయి విజయన్, ఓడిపోతానని ఫిక్స్ అయ్యారా!

కేరళ ఫలితాలకు ముందే సంచలనం.. సీఎం హోదాను తొలగించిన పినరయి విజయన్, ఓడిపోతానని ఫిక్స్ అయ్యారా!
Advertisement

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరో 12 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా ఖాతాలలో కీలక మార్పులు చేశారు. తన అధికారిక ప్రొఫైల్స్ నుంచి ‘చీఫ్ మినిస్టర్’ అనే హోదాను ఆయన తొలగించారు. ఆ స్థానంలో కేవలం ‘భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు’ అని మార్చుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడి.. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అధికారంలో ఉన్నవారు తమ హోదాలను కొనసాగిస్తుంటారు. అయితే పినరయి విజయన్ ఫలితాలకు కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చకు దారితీసింది. పినరయి విజయన్ అనుసరించిన ఈ శైలి ఆయన నైతికతకు నిదర్శనమా లేక ఫలితాలపై ముందస్తు సంకేతమా అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం ఉండగా.. దాన్ని తిరగరాస్తూ గత ఎన్నికల్లో పినరయి రెండోసారి వరుసగా విజయం సాధించారు. ఈసారి హ్యాట్రిక్ విజయంపై ఎల్డీఎఫ్ (LDF) ధీమాగా ఉన్న తరుణంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ ఈ పరిణామంపై ఆసక్తి నెలకొంది. కేరళలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో పినరయి విజయన్ చర్యను రకరకాలుగా అంచనా వేస్తున్నారు. కేవలం సాంకేతిక కారణాల వల్ల లేదా పార్టీ నిబంధనల ప్రకారం ఆయన ఈ మార్పు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఫలితాల రాకముందే తన హోదాను మార్చుకోవడం భారత రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తుంటుంది. సీపీఎం శ్రేణులు మాత్రం దీన్ని ఒక సాధారణ ప్రక్రియగానే కొట్టిపారేస్తున్నాయి.

రేపు ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్‌లో కేరళ ప్రజల తీర్పు ఏంటనేది స్పష్టం కానుంది. పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) పుంజుకుంటుందా అన్నది తేలిపోనుంది. ఈ ఉత్కంఠ మధ్య సీఎం తన సోషల్ మీడియా బయో (Bio) మార్చడం వల్ల అటు రాజకీయ నాయకుల్లో ఇటు సామాన్య ప్రజల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ మార్పు కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఒక పెద్ద సంచలనంగా మారింది.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. వెంటనే కారు ఆపి..? మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×