BigTV English

YS Jagan: నా రెండు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి: కిరాక్ ఆర్పీ హాట్ కామెంట్స్

YS Jagan: నా రెండు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి: కిరాక్ ఆర్పీ హాట్ కామెంట్స్

MP Vijaysai Reddy: కిరాక్ ఆర్పీ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నెల్లూరు వాసి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై తీవ్రంగా స్పందించారు. విజయసాయి రెడ్డ తరఫున తాను నెల్లూరి వాసిగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. నెల్లూరులో మంచి వాళ్లు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్లు పుట్టారని, పొట్టి శ్రీరాములు వంటి గొప్ప వ్యక్తిని తమ నేల కన్నదని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రధాన కారకుడు పొట్టి శ్రీరాములేనని వివరించారు. అయితే, అదే నెల్లూరు గడ్డపై విజయసాయి రెడ్డి వంటి వారు కూడా జన్మించారని సెటైర్ వేశారు.


వైఎస్ జగన్ నుంచి తనక రెండు ప్రశ్నలకు సమాధానం కావాలని కిరాక్ ఆర్పీ కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డి డీఎన్ఏ టెస్టుకు వెళ్లుతారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా? రారా? అనే ప్రశ్నకు కూడా తనకు సమాధానం కావాలని తెలిపారు.

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తే డీఎన్ఏ టెస్టు అవుతుందా? అని కిరాక్ ఆర్పీ ప్రశ్నించారు. అసలు తిరుపతిని నాశనం చేసిందే మీరు కదా? అని విమర్శలు సంధించారు. వయసు చెబితే డీఎన్ఏ టెస్టు అవుతుందా? అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి నోరు మూసుకుని డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఏ2గా సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్న అనుభవం విజయసాయి రెడ్డికి ఉన్నదని తెలిపారు. విజయసాయి రెడ్డి మీడియాపై అవాకులు చెవాకులు పేలారని, అందుకే మీడియాకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు కిరాక్ ఆర్పీ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా లేకపోయినా యాక్టింగ్ చేస్తున్నారని, వైసీపీ ఒంటిలోనే ఈ గుణం ఉన్నట్టు ఆరోపించారు. వినుకొండుకు వచ్చి జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని, అక్కడా గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడటం విషాదం అని పేర్కొన్నారు.


Aslo Read: Kethireddy peddareddy left Tadipatri: తాడిపత్రిలో పోలీసుల టెన్షన్, పెద్దారెడ్డి వచ్చి మళ్లీ వెళ్లారు

విజయసాయి రెడ్డి డీఎన్ఏ చేసుకోవాలని, అలాగే.. వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చించాలని కిరాక్ ఆర్పీ డిమాండ్ చేశారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×