E-Paper
Advertisement

Lockdown: లాక్‌డౌన్ వార్తలపై కేంద్రం కీలక ప్రకటన.. నేడు సీఎంలతో ప్రధాని సమావేశం

Lockdown: లాక్‌డౌన్ వార్తలపై కేంద్రం కీలక ప్రకటన.. నేడు సీఎంలతో ప్రధాని సమావేశం
Advertisement

Lockdown: ఇరాన్ యుద్ధం మొదలైన మూడోవారం తర్వాత దాని పరిణామాలు ఇప్పుడిప్పుడే వివిధ దేశాలపై పడుతున్నాయి.  దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ప్రచారం రోజురోజుకూ పెరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆయిల్ మంత్రి హర్దీప్‌సింగ్.

లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ..  వదంతులకు ఆయిల్ మంత్రి ఫుల్‌స్టాప్

Advertisement

అదిగో పులి.. ఇదిగో మేక అన్నచందంగా ఉంది దేశంలో పరిస్థితి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా దేశీయ అవసరాలు తీర్చే హోర్మూజ్ జలసంధి గడిచిన మూడువారాలుగా ఇరాన్ మూసి వేసింది. ఫలితంగా ఆసియా దేశాలకు కష్టాలు మొదలయ్యాయి.

ఆయిన్, గ్యాస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆ సెగ ఇండియాకు తగిలింది. వెంటనే రంగంలోకి దిగిన కేంద్రం.. చమురు సరఫరా చేసే దేశాల నుంచి ఇండియాకు ఆయిల్ రప్పించింది ఇంకా కంటిన్యూ అవుతోంది. మరో రెండు నెలలపాటు దేశంలో ఆయిల్‌కు ఎలాంటి కొరత లేదని తేల్చి చెప్పింది కేంద్రం.

Advertisement

ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం మాటేంటి?

ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి శుక్రవారం సాయంత్రం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియా కాన్పరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు.దీంతో దేశ ప్రజలందిరిలోనూ అనుమానాలు తీవ్రమయ్యాయి. కచ్చితంగా లాక్‌డౌన్ ఉంటే అవకాశముందని వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఆయిల్ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. లాక్‌డౌన్‌పై వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమన్నారు. ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదన్నారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నారన్న వదంతులను ఆయన కొట్టిపారేశారు.

ALSO READ: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

ఇరాన్ యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ఇంధనం, విద్యుత్, ఇతర కీలకమైన సరఫరాలు నిరంతరాయంగా లభించేలా అన్నిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి నొక్కి చెప్పారు.

ఇరాన్ యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశిస్తుందనగా శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.  ఈ సమావేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? కేవలం పరిశ్రమలకు ఆయిల్ సరఫరాపై మాట్లాడుతారా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆయిల్ కొరత వల్ల దాని ఆధారిత కంపెనీలు చాలావరకు మూతపడిన విషయం తెల్సిందే.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×