NH-45 Red Road: వన్యప్రాణులను రక్షించడానికి మధ్యప్రదేశ్ జాతీయ రహదారిపై దేశంలోనే తొలిసారిగా ‘రెడ్ రోడ్’ను నిర్మించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిపై టేబుల్ టాప్ రెడ్ రోడ్ మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా వెళుతున్న NH-45 రోడ్డుపై 2 కి.మీ. విస్తీర్ణంలో రెడ్ మార్క్స్ ఏర్పాటు చేశారు.
టైగర్ రిజర్వ్ మార్గంలో వాహనాల వేగాన్ని తగ్గించడానికి, డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఈ విధంగా రెడ్ రోడ్డు మార్కింగ్ చేశారు. దీంతో జంతువులు వాహనాలను ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
జాతీయ రహదారిపై కొద్ది ఎత్తున, ఎరుపు రంగు మార్కింగ్ చేస్తారు. ఇది టేబుల్ టాప్ రోడ్ మార్కింగ్ ఉంటుంది. సంప్రదాయ స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా కాకుండా, ఈ డిజైన్ డ్రైవర్లు సడెన్ బ్రేకింగ్ లేకుండా సహజంగానే వేగాన్ని తగ్గించేలా చేస్తుంది. అటవీ మార్గంలో వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులను అలర్ట్ చేయడానికి స్పష్టమైన సూచికలుగా రెడ్ రోడ్డు పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
नए भारत की नई सोच,
समृद्धि भी, सुरक्षा भी!NH-45 पर वीरांगना दुर्गावती टाइगर रिजर्व से गुजरते 2 किमी हिस्से में लाल उभरी सड़क बनाई गई है। यह स्मार्ट इंफ्रास्ट्रक्चर न सिर्फ ड्राइवर को अलर्ट करता है, बल्कि जानवरों की जान भी बचाता है।
ये नया मॉडल वन्यजीव सुरक्षा की दिशा में… pic.twitter.com/HP3RuySuYk
— BJP (@BJP4India) December 13, 2025
వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ లో తరచుగా పులులు, ఇతర జంతువులు తరచుగా హైవేను దాటుతుంటాయి. దీంతో వేగంగా వచ్చే వాహనాలతో జంతువులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు అధికారులు రెడ్ రోడ్డును ఏర్పాటు చేశారు. సాధారణ రోడ్డు సూచికలు, స్పీడ్ బ్రేకర్లతో పోలిస్తే ఎరుపు రంగు రోడ్డు మార్కింగ్ ప్రమాదాలు తగ్గుతాయని, ట్రాఫిక్ సజావుగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రెడ్ రోడ్డు చొరవ ఒక ఉదాహరణ అని నెటిజన్లు అంటున్నారు. అటవీ ప్రాంతాలలో వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రెడ్ రోడ్డు ప్రాజెక్టు విజయవంతం అయితే దేశవ్యాప్తంగా అమలుచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: Himalaya Mountain COLLAPSE: హిమాలయాల్లో టైమ్‌బాంబ్.. డేంజర్‌లో భారత్!
రెడ్ రోడ్డు వీడియో బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. వన్యప్రాణులు-మానవ అభివృద్ధి రెండింటికి ఇబ్బంది లేకుండా ఈ తరహా ప్రాజెక్టులు అవసరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.