E-Paper
Advertisement

విజయ్ కు మ‌రో షాక్.. క్రిమినల్ కేసు పిటిషన్‌ను విచారించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం!

విజయ్ కు మ‌రో షాక్.. క్రిమినల్ కేసు పిటిషన్‌ను విచారించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం!
Advertisement

Vijay Income Tax case: టీవీకే అధినేత, న‌టుడు విజ‌య్ కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న వేళ‌.. విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. రాజ్‌కుమార్ వర్సెస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ కేసులో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

గతంలో ఈ పిటిషన్ విచారణార్హతపై సందేహాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రీ దీనిని నమోదు చేయడానికి నిరాకరించింది. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి.. జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌ల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణార్హతకు లోబడి దీనిని నమోదు చేయాలని.. వెంటనే సంబంధిత బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఒక పిటిషన్ న్యాయపరంగా నిలబడుతుందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు రిజిస్ట్రీకి లేదని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

విజయ్‌పై దాఖలైన ఈ పిటిషన్‌లో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన గత సర్చ్ ఆపరేషన్లు.. విజయ్ స్వయంగా ఇచ్చిన స్టేట్‌మెంట్లు.. పెనాల్టీ ఆర్డర్ల ఆధారంగా పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 276C కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని అభ్యర్థించారు. వీటితో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం మోసం (Cheating).. నకిలీ పత్రాల తయారీ (Forgery).. క్రిమినల్ కుట్ర (Criminal Conspiracy) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందేమో తేల్చడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేత విచారణ జరిపించాలని కోరారు.

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పక్షాల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కసరత్తు జరుగుతున్న తరుణంలో ఈ కోర్టు ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రిజిస్ట్రీ తన పరిధిని దాటి పిటిషన్లను తిరస్కరించకూడదని.. పత్రాలు సరిగా ఉంటే కచ్చితంగా నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే “Subject to maintainability” అని నోట్ చేసి న్యాయమూర్తుల ముందుకు పంపాలని రిజిస్ట్రీకి నిబంధనలు గుర్తు చేసింది.

Advertisement

Read Also: విజయ్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు?, ప్రభుత్వ ఏర్పాటు దిశగా..!

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×