E-Paper
Advertisement

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. జాగ్రత్త

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. జాగ్రత్త
Advertisement

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచవ్యాప్తంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన ఆహారం, తప్పుడు జీవనశైలి వల్ల ఈ సమస్య ఎక్కువవుతుంది. డాక్టర్లు సైలెంట్ కిల్లర్ అంటారు. మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ నెమ్మదిగా శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు పెరుగుతాయి.

అధిక కొలెస్ట్రాల్ వల్ల ఏమవుతుంది?

కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే కొవ్వు పదార్థం. శరీరానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తనాళాలు ఇరుకుగా మారిపోతాయి. రక్తప్రవాహం తగ్గి ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ సరిగా చేరదు.

ఛాతీ నొప్పి హెచ్చరిక సంకేతం

Advertisement

అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు చాలా మందికి ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి వస్తుంది. గుండెకు రక్తం తీసుకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా మారిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ కారణంగానే ఛాతీ నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఎందుకంటే ఈ సమస్య తీవ్రమైతే గుండె పోటు రావొచ్చు.

కాళ్లలో తిమ్మిరి 

రక్తప్రసరణ తగ్గితే కాళ్లు, పాదాల్లో తిమ్మిరి, నొప్పి లేదా బలహీనత వస్తుంది. కొద్ది దూరం నడిస్తేనే తిమ్మిరి వచ్చి విశ్రాంతి తీసుకుంటే తగ్గడం సాధారణం. చల్లని పాదాలు, నెమ్మదిగా మానే గాయాలు కూడా కనిపిస్తాయి.

కళ్ల చుట్టూ పసుపు మచ్చలు

Advertisement

కొంతమందికి కళ్ల పైకప్పు చుట్టూ పసుపు రంగు మచ్చలు వస్తాయి. వీటిని జాంతెలాస్మా అంటారు. ఇవి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టు సంకేతం. చాలా మంది దీన్ని సాధారణ చర్మ మార్పు అని అనుకుంటారు. కానీ ఇది గుండె సమస్యలను ముందుగా చెబుతుంది.

నిరంతర అలసట, బలహీనత

శరీరం ఆక్సిజన్ సరిగా అందించలేకపోతే ఎప్పుడూ అలసట, బలహీనత వస్తుంది. తగినంత నిద్రపోయినా శక్తి తగ్గుతుంది. చిన్న పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి.

పని చేసే సమయంలో సరిగా ఊపిరి అందకపోవడం

తేలికపాటి వ్యాయామం చేసినా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం.. రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్లు సూచిస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం సాధారణ లక్షణం.

చర్మం, గోళ్లలో మార్పులు

రక్తప్రసరణ తగ్గితే కాళ్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. గోళ్ల రంగు పేలవంగా ఉంటుంది. గోళ్లు ఆలస్యంగా పెరుగుతాయి. గాయాలు నెమ్మదిగా మానతాయి. ఈ సంకేతాలు చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. అంటే అప్పటికే సమస్య తీవ్రంగా ఉన్నట్లు. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ అంటే అడ్డంకి ఉందని అర్థం. ఈ సంకేతాలు నిరంతరం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

తలనొప్పి, మతిమరుపు

మెదడుకు రక్తం తగ్గితే తలనొప్పి, మరచిపోవడం, ఏకాగ్రత తగ్గడం వస్తాయి. వెంటనే డాక్టర్‌ను చూపించాలి.

Also Read: 50 ఏళ్ల వయసులో కూడా యంగ్ లుక్స్ కావాలా? భారీ జిమ్ అవసరం లేదు.. సింపుల్‌గా ఈ వ్యాయామాలు చేయండి

అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ఎలా

రోజూ వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలు, పీచుతో కూడిన ఆహారం తినాలి. వేయించిన, జంక్ ఫుడ్ తగ్గించాలి. ధూమపానం, మద్యం మానాలి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి.

Related News

కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు

వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

ఒకేసారి ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త ఈ కాంబినేషన్లు ప్రమాదకరం

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

Big Stories

Advertisement
×