E-Paper
Advertisement

Ranbir Kapoor: ‘యానిమల్’.. 2 కాదు 3.. అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్!

Ranbir Kapoor: ‘యానిమల్’.. 2 కాదు 3.. అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్!
Advertisement

Ranbir Kapoor:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy vanga).. ప్రస్తుతం ప్రభాస్(Prabhas )తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 5వ తేదీ ముందు.. తర్వాత.. కొన్ని సెలవు దినాలు ఉండడంతో ఆ డేట్ ను మరొకరు ఫిక్స్ చేసుకోకుండా ఏడాది ముందే ఆలోచించి తమ సినిమా విడుదల తేదీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ మొదలవుతుందని.. ఇటు యానిమల్ సినిమా హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

యానిమల్ ఏకంగా 3 భాగాలు..

ఒకప్పుడు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డివంగా.. రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి , రష్మిక మందన్న లతో కలిసి యానిమల్ సినిమా చేసి సంచలనం సృష్టించారు. ఈ ఒక్క సినిమాతో వైల్డ్ డైరెక్టర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అటు4 యానిమల్ సినిమా సక్సెస్ సాధించడంతో ‘యానిమల్ పార్క్’ పేరుతో రెండో పార్ట్ కూడా రాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా తాజాగా రణబీర్ కపూర్ స్పందించి సినిమాపై అంచనాలు పెంచేశారు. 2027లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

సడన్ ట్విస్ట్ ఏంటంటే?

Advertisement

ఇకపోతే యానిమల్ సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుందని వెల్లడించిన రణబీర్ కపూర్.. ఈ సినిమాలో హీరోగా, విలన్ గా రెండు పాత్రలు తానే పోషిస్తున్నట్లు హింట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఈ సినిమా రెండు కాదు ఏకంగా మూడు పార్ట్ లు చేసేందుకు సందీప్ రెడ్డి వంగా ప్రయత్నం చేస్తున్నట్లు అభిమానులతో వెల్లడించారు. మొత్తానికైతే యానిమల్ సినిమా 2 కాదు 3 భాగాలుగా రాబోతోందని.. పైగా ఈ సినిమాలలో హీరోగా, విలన్ గా రెండు పాత్రలు తానే చేయబోతున్నానని సడన్ ట్విస్ట్ ఇచ్చి అంచనాలు పెంచేశారు రణబీర్ కపూర్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ALSO READ:Sreeleela: కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల .. ఇలాంటి పాత్రలకే పరిమితమా?

రణబీర్ కపూర్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

రణబీర్ కపూర్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. సంజయ్ లీల భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణం పార్ట్ – 1’ లో రాముడు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా మొదటి భాగం విడుదల చేయనున్నారు. అలాగే ధూమ్ 4లో ఈయన నటిస్తున్నారు. మొత్తానికైతే వరుస సినిమాలతో మరో నాలుగు ఐదు సంవత్సరాల పాటు రణబీర్ కపూర్ బిజీగా ఉండనున్నారని చెప్పవచ్చు.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×