E-Paper
Advertisement

Mahua Moitra : టీఎంసీ నేత మహువా కేసు.. మాజీ స్నేహితుడు దెహద్రాయ్‌కు సీబీఐ సమన్లు..

Mahua Moitra : టీఎంసీ నేత మహువా కేసు.. మాజీ స్నేహితుడు దెహద్రాయ్‌కు సీబీఐ సమన్లు..
Advertisement

Mahua Moitra : లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె మాజీ మిత్రుడు జై అనంత్ దెహద్రాయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు ఇచ్చింది. గురువారం(జనవరి 25) ఆయన్ను సీబీఐ ప్రశ్నించనుంది.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొయిత్రా పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది దెహద్రాయ్‌ను కమిటీ విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ గతంలో ప్రకటించారు.

Advertisement

పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన కొందరు పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలతో మహువా తనపై అక్రమంగా నిఘా ఉంచారని డిసెంబర్‌లో దెహద్రాయ్‌ సీబీఐకి లేఖ రాశారు. తన ఫోన్‌ నెంబర్‌తో, తాను ఎక్కడున్నాననే విషయాన్ని ట్రాక్‌ చేసే అవకాశం ఉందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×