E-Paper
Advertisement

ఎట్టకేలకు గ్యాస్ సిలిండర్ కష్టాలు తీరినట్టే.. పాత రోజులు వచ్చినట్టే, గ్యాస్ బుకింగ్‌పై ప్రభుత్వం ప్రకటన

ఎట్టకేలకు గ్యాస్ సిలిండర్ కష్టాలు తీరినట్టే.. పాత రోజులు వచ్చినట్టే, గ్యాస్ బుకింగ్‌పై ప్రభుత్వం ప్రకటన
Advertisement

Gas Cylinder: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు కొండంత భరోసా ఇచ్చింది కేంద్రప్రభుత్వం. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న ఆందోళనలను పటాపంచలు చేసింది. వంట గ్యాస్ బుకింగ్‌పై కీలక ప్రకటన జారీ చేసింది. దీంతో గ్యాస్ బుకింగ్‌కు మళ్లీ పాత రోజులు వచ్చినట్టే.

దేశంలో గ్యాస్ సిలిండర్ కష్టాలు తీరినట్టే.. పాత రోజులు వచ్చాయి

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. ఈ సెగ ఆసియా దేశాలకు బాగా తగిలింది. చివరకు గ్యాస్ సిలిండర్ విషయంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హూర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ కేంhttps://www.bigtvlive.com/national/madras-high-court-notices-vijay-asset-discrepancy.htmlద్రం కీలక ప్రకటన చేసింది. ఇంధన కొరత వస్తుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది.

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా తాపీగా సాగుతోందని వెల్లడించింది. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పెట్రోలియం శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు-సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాతా శర్మ కొన్ని విషయాలు వెల్లడించారు. సామాన్యులపై పడకుండా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచినట్లు తెలియజేశారు.

Advertisement

గ్యాస్ బుకింగ్‌పై ప్రభుత్వం ప్రకటన,  ఇంధన కొరత లేదు

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ గడువును పెంచడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. అదే సమయంలో పట్టణ, నగరాల్లో గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ పద్దతి కఠినంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వం కొన్నాళ్లుగా డీఏసీ కోడ్ చాన్నాళ్లుగా అమలు చేస్తోంది. అయితే ఈ విధానాన్ని 90 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 92 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనికితోడు కమర్షియల్ గ్యాస్ సరఫరాను 70 శాతం మేరా పునరుద్ధరించినట్టు తెలిపారు. గడిచిన నాలుగైదు రోజులుగా ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే 5 కిలోల చిన్న సిలిండర్ల విక్రయాలు పెరిగాయి.

39 వేల కంటే ఎక్కువమంది PNG వినియోగదారులు.. తమ LPG కనెక్షన్‌లను వదులుకున్నట్లు ఆ శాఖ పేర్కొంది. పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు వైపు వినియోగదారులు మొగ్గుచూపారు. ఆటో ఎల్‌పిజి వినియోగంలో గణనీయమైన పెరుగుదల సూచించింది.

ALSO READ: రూ.100 కోట్ల లెక్క ఎక్కడ? టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసుల షాక్!

ఫిబ్రవరి 26న రోజుకు 177 మెట్రిక్ టన్నుల సగటు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ 17 నాటికి సగటు ఆటో ఎల్‌పిజి అమ్మకాలు రోజుకు సుమారు 305 మెట్రిక్ టన్నులకు చేరాయని పేర్కొంది. అదే సమయంలో వివిధ దేశాల నుంచి వస్తున్న చమురు నౌకలపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

97వేల మెట్రిక్ టన్నుల ముడి చమురుతో వస్తున్న భారత నౌక దేశ్‌గరిమా సురక్షితంగా ప్రయాణిస్తోందన్నారు. ఈ నెల 18న హార్ముజ్ జలసంధి వద్ద ఈ నౌక ఎలాంటి ఆటంకాలు లేకుండా దాటిందన్నారు. 31 మంది భారతీయ నేవీ టీమ్ ప్రయాణిస్తున్న నౌక బుధవారం ముంబైకి చేరుకుంటుందని ఆ శాఖ పేర్కొంది.

Related News

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

హనీమూన్‌లో దంపతుల మధ్య మంటలు.. నవ వధువుకి తీవ్రగాయాలు, డార్జిలింగ్‌లో ఘటన

స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. గ్రూప్ CISO జాబ్స్.. రూ.2.5 కోట్ల వరకు సాలరీ

31 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష.. కోర్టు విచిత్ర తీర్పు

76వ పుట్టినరోజు వేళ.. మోదీపై జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్.. ఇంతకీ ఏమన్నారంటే?

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

Big Stories

Advertisement
×