MI VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 40 శాతం మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Mumbai Indians, 30th Match ) మధ్య నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ( Narendra Modi Stadium, Ahmedabad) బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్, వరస ఓటముల తర్వాత విజయాన్ని దక్కించుకుంది. అయితే ముంబై విజయం వెనుక అంబానీ ఫ్యామిలీ కుట్ర ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఓనర్లు నీతా అంబానీ, ఆకాష్ ఇద్దరు కలిసి డగౌట్ నుంచి అంపైర్లను బెదిరించినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. అంపైర్లలను బెదిరించిన నేపథ్యంలోనే నిన్న గుజరాత్ పైన ముంబై ఇండియన్స్ విజయం సాధించిందని క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముంబై ఎక్కడ ఉంటే అక్కడ ఫిక్సింగ్.. లేదా ఇలా అంపైర్లను బెదిరించడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఫైర్ అవుతున్నారు.
Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిపడేస్తాం Javed Miandad
ముంబై ఇండియన్స్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్లుగా వ్యవహారం తయారయింది. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగగా.. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ చేసిన ఓ కుట్ర బయటపడినట్లు వీడియో వైరల్ గా మారింది. డగౌట్ దగ్గరే సోఫాలలో కూర్చునే నీతా అంబానీ, ఆమె కుమారుడు ఆకాష్… నిన్న కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారు. రివ్యూలు తీసుకోమని డగౌట్ నుంచే హార్దిక్ పాండ్యాకు సైగలు చేశారు. అలాగే అంపైర్లను కూడా బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఔట్ ఇవ్వాల్సిందేనని నీతా అంబానీ సైగలు చేస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది. నిన్నటి మ్యాచ్ సందర్భంగా అంబానీ ఫ్యామిలీనే బెదిరించిందని, దీంతో అంపైర్లు కూడా వణికిపోయి సరెండర్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. అందుకే వరుస ఓటముల తర్వాత ముంబై, నిన్న గెలిచిందని అంటున్నారు. ఈ మ్యాచ్ పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 199 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదు వికెట్లు నష్టపోయింది ముంబై ఇండియన్స్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తడబడిన గుజరాత్ 100 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో ముంబై విజయం సాధించింది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==