E-Paper
Advertisement

మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!
Advertisement

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: ‘ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ చేతకానితనంతో వచ్చిన కరువు.. నీళ్లు, కరెంటు రెండు విషయాల్లోనూ తమ తప్పిదాలను ప్రకృతి ఎల్‌నినో పైన నెట్టి చేతులెత్తేయడం బాధ్యతారాహిత్యం’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి, విద్యుత్ కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు.  ప్రకృతి వైపరీత్యం ఎల్‌నినో వల్లే కరువు వచ్చిందని ప్రభుత్వం చేతులెత్తేయడాన్నితప్పుబట్టారు.

హరీశ్ రావు మాట్లాడుతూ..

Advertisement

తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తో కలిసి పోరాడిన ఉద్యమకారుడిగా, 24 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్న సీనియర్ సభ్యుడిగా, రైతు బిడ్డగా నాకిది రాజకీయం కాదు బాధ్యత.. ప్రజల ఇబ్బందులపైబాధ్యతతో మాట్లాడుతున్నానన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది తెలంగాణ 84 టీఎంసీలు వాడుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. 84టీఎంసీలు వాడితే ఆ నీళ్లు ఎక్కడికి పోయాయి? ఏ రిజర్వాయర్ నింపారు? ఏ పొలాలకు ఇచ్చారు? శ్రీశైలం మీద మనకున్నది కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు మాత్రమేనన్నారు. కేసీఆర్ కి పేరు వస్తుందని పాలమూరు మోటార్లను మూడేళ్లుగా పండబెట్టారు.. ఇక కల్వకుర్తిలో ఇప్పటివరకు ఎత్తింది కేవలం 8 టీఎంసీలు మాత్రమేనన్నారు.

ఏపీ వాడుకున్నది 71.5%.. మనది కేవలం 28%!

Advertisement

కృష్ణా బేసిన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 2024-25లో 286 టీఎంసీల నీటిని వాడామని ఉత్తమ్ చెప్పారని, కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ సీడబ్ల్యూసీ అఫీషియల్ రికార్డుల ప్రకారం తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల వినియోగంలో అత్యంత చెత్త రికార్డ్ ఎవర్ లోయెస్ట్ యుటిలైజేషన్ ఈ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలోనే నమోదైందన్నారు. నదిలో నీళ్లు వచ్చినప్పుడు 2014 నుంచి 2017 వరకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ 31%, 35.8%, 45% దాకా నీటిని వాడుకుంటే.. 2024-25లో ఆంధ్రప్రదేశ్ 71.5% వాడుకుంది.. తెలంగాణ వాడింది కేవలం 28.4% మాత్రమేనన్నారు. ఇక ఈ ఏడాది (2025-26) అయితే మరీ ఘోరంగా కేవలం 25% మాత్రమే వాడుకున్నారని, మన వాటా 36% ఉంటే, దాన్ని కూడా వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ది అని మండిపడ్డారు.

ఇది కాంగ్రెస్ వైఫల్యం కాదా?

ఈ కరువు కాలంలో ఈ ఏడాది ఏపీ 83 టీఎంసీలు వాడుకుంటే, హైదరాబాద్ తాగునీటితో కలిపి తెలంగాణ వాడింది కేవలం 43 టీఎంసీలే. ఇది కాంగ్రెస్ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద శ్రీశైలంలో నీళ్లున్నా ఐదు మోటార్లకు గాను ఒకటి, రెండే నడుపుతున్నారని, అది కూడా రోజుకు 10 గంటలే నడుపుతున్నారన్నారు. కరెంట్ లేక మోటార్లు నడపక, కేసీఆర్ క్రియేట్ చేసిన 3 లక్షల 16 వేల ఎకరాల ఆయకట్టును ఆగం చేస్తున్నారన్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల కింద దాదాపు 3 లక్షల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదకర స్థితిలో ఉందని, కనీసం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగి ఆల్మట్టి నుంచి ఒక నెల రోజులు నీళ్లు తెప్పించి పంటలు కాపాడే సోయి లేదన్నారు.

హరీశ్ రావు లేఖ..

గోదావరి బేసిన్‌ లో అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణే,ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ నా దగ్గర ఉందన్నారు. రీబౌండ్ హామర్ టెస్ట్, జీపీఆర్, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ, యూపీవీవంటి మూడు రకాల టెస్టులు చేశారన్నారు. సుందిళ్ల, అన్నారంలో 100% కాంక్రీట్ ‘వెరీ గుడ్, గుడ్, ఎక్సలెంట్’ అని రిపోర్ట్ ఇచ్చారు. మేడిగడ్డలో కూడా కుంగిన బ్లాక్-7 మినహా, మిగతా ఆరు బ్లాకులు సేఫ్ అని తేల్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నీళ్లు ఎత్తుకోవచ్చని ఎన్డీఎస్ఏ హైకోర్టులో అఫిడవిట్ వేసిందని, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచి ప్రవాహం ద్వారా నీళ్లు ఎత్తొచ్చని లేఖ రాశారన్నారు. అయినా కూడా మోటార్లు ఆన్ చేయడం లేదు. ప్రజల మీద ఎందుకంత పగ? అని నిలదీశారు.

కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ కక్షా?

ఈ నిమిషానికి కూడా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 46,990 క్యూసెక్కుల ప్రవాహం, రోజుకు 4 టీఎంసీలకు పైగా వృథాగా పోతోందన్నారు. బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా నీటి మట్టం 96 మీటర్లు ఉందని, కన్నేపల్లి పంప్ హౌస్ నడవడానికి కావాల్సిన కనీస మట్టం ఎండీడీఎల్ 93.5 మీటర్లు ఉంటే చాలు.. అంటే ఇప్పుడే మోటార్లు ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీలు ఎల్లంపల్లికి ఎత్తుకోవచ్చు.. కానీ కేసీఆర్ కు పేరు వస్తుందనే రాజకీయ కక్షతో నీళ్లు ఎత్తకుండా రైతుల ఉసురుపోసుకుంటున్నారన్నారు. దేవాదులలో 10 మోటార్లు ఉంటే నాలుగే నడిపారు.. బీఆర్ఎస్ పోరాటం చేస్తే కానీ 9 మోటార్లు ఆన్ చేయలేదన్నారు. దేవాదుల పంపులకు తక్కువ ప్రవాహంలోనూ నీళ్లు అందుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ నిర్మించిన సమ్మక్క బ్యారేజ్ కాదా? అని నిలదీశారు. ఎల్లంపల్లిలో ఈసారి 37 టీఎంసీల ఫ్లడ్ వస్తే.. కేవలం 6 టీఎంసీలు మాత్రమే ఎత్తి, మిగతా నీళ్లంతా కిందకు వదిలేశారు. ప్యాకేజ్-8 వద్ద రౌండ్ ద క్లాక్ విద్యుత్ ఇచ్చి మోటార్లు నడిపి ఉంటే ఆ నీటిని ఒడిసిపట్టే అవకాశం ఉండేదన్నారు.

పవర్ ప్లాంట్లను ఎందుకు సిద్ధం చేసుకోలేదు?

కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లెక్కల ప్రకారమే.. 4000 మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన యాదాద్రి పవర్ ప్లాంట్ లో బొగ్గు లేక కేవలం 1500 మెగావాట్లే ఉత్పత్తి అవుతోందని, భద్రాద్రిలో బాయిలర్ ట్యూబ్ లీక్, ప్రొటెక్షన్ ఇష్యూస్ అని చెప్పి 540 మెగావాట్లు బంద్ పెట్టారు. కొత్తగూడెంలో 800 మెగావాట్లు బంద్ పెట్టారు.. దాదాపు 3,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వ వైఫల్యంతో నిలిపివేశారన్నారు. 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని నా మీద దాడి చేశారు కదా.. అంత స్టాక్ ఉన్నప్పుడు కరెంట్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయింది? అని నిలదీశారు. ఎల్‌నినో వస్తుందని ఆరు నెలల ముందే తెలిసినప్పుడు.. బొగ్గు నిల్వలు పెంచుకుని పవర్ ప్లాంట్లను ఎందుకు సిద్ధం చేసుకోలేదు? అని నిలదీశారు.

ఏకపక్ష సస్పెన్షన్..

కరెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండి కూడా రైతులను కరెంట్ కోతలతో గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాలన్నింటినీ మేము అసెంబ్లీలో నిలదీస్తామనే భయంతోనే మా గొంతు నొక్కడానికి బీఆర్ఎస్ సభ్యులందరినీ ఏకపక్షంగా సస్పెండ్ చేశారన్నారు. బురద రాజకీయాలు మాని పరిపాలన మీద, ప్రజలకు కరెంటు, నీళ్లు ఇవ్వడం మీద దృష్టి పెట్టండి అని సూచించారు. బేషజాలు పక్కనపెట్టి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి గోదావరి నీళ్లు ఎత్తండి.. యాదాద్రి, భద్రాద్రిలలో విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

Tags

Related News

కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా.. ఫ్రెండ్స్‌తో వ్యాపారాలు, లాభాలు మాత్రం కేటీఆర్‌కే: బండి సంజయ్

రైతుల కోసం మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ ఫోన్.. జూరాల నీటిపై కీలక విజ్ఞప్తి

ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!

మనసు మార్చుకున్న దానం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు? అలర్టయిన మిగతా పార్టీలు, ఏం జరుగుతోంది?

డివైడర్‌ని ఢీ కొట్టిన కారు, ఓ వ్యక్తి సజీవదహనం! సూర్యాపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

Big Stories

Advertisement
×