BigTV English

Mumbai Techie jumps off atal setu: ముంబై టెక్కీ.. అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య

Mumbai Techie jumps off atal setu: ముంబై టెక్కీ.. అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య

Mumbai Techie jumps off atal setu: ముంబైలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు. అటల్ సేతుపై నుంచి సముద్రంలోని దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మృతదేహం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తే..


బుధవారం మధ్యాహ్నం కరెక్ట్‌గా పన్నెండున్నర అవుతోంది. ముంబైలోని అటల్‌సేతు బ్రిడ్జిపై కారుతో ఓ వ్యక్తి వేగంగా వచ్చాడు. పక్కనే కారు ఆపి దానిపై నుంచి సముద్రంలోని దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు కరుతురి శ్రీనివాస్, వయస్సు 38 ఏళ్లు. డోంబ్లివాలి ప్రాంతంలో ఉంటున్నారు. శ్రీనివాస్‌కు మ్యారేజ్ అయ్యింది ఐదేళ్ల కూతురు కూడా ఉంది.

శ్రీనివాస్ గతంలో లోధా గ్రూప్‌లో పనిచేశాడు. కొన్నాళ్లపాటు కువైట్‌లో ఉన్నాడు. గతేడాది ముంబైకి తిరిగి వచ్చాడు. శ్రీనివాస్ ఓ వ్యక్తితో కలిసి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం ప్రారంభించాడు. మరి ఇద్దరి మధ్య విభేదాలు ఏంటో తెలీదుగానీ కువైట్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఫ్యామిలీ సభ్యులు సకాలంలో స్పందించడంతో బయటపడ్డాడు.


ALSO READ: డిప్యూటీ సిఎంతో భేటీ అయిన నటుడు దర్శన్ భార్య.. డికె శివకుమార్ ఏం చెప్పారంటే?..

మంగళవారం రాత్రి శ్రీనివాస్ తన బంధువులతో దాదాపు గంటలకు పైగానే మాట్లాడినట్టు  ఆయన భార్య చెప్పింది. మరి ఏమైందో తెలీదుగానీ చివరకు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణమని శ్రీనివాస్ కుటుంబసభ్యులు చెబుతున్నమాట.

 

Related News

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Ayodhya: అయోధ్యలో మరో కీలక ఘట్టం.. బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధం

India Vs America: భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాక్‌తో అమెరికా సీక్రెట్ డీల్స్..

Big Stories

×