Big Boss reality show season 8 coming soon..How much remunaration Nagarjuna demend
తెలుగు ప్రేక్షకులలో ఈ మధ్య కాలంలో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే ఠక్కున చెప్పేస్తారు బిగ్ బాస్. తరగని ప్రజాదరణతో ఎప్పటికప్పుడు వ్యూయర్స్ ని పెంచుకుంటూ పోతోంది బిగ్ బాస్. ఒక పక్క బిగ్ బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం బిగ్ బాస్ షోల మీద రోజువారీ రివ్యూలు ఇస్తూ తర్వాత ఏం జరగబోతోంది. నెక్ట్స్ వీక్ హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరు? ఫలానా వాళ్ల తీరు బాగోలేదు. వాళ్ల యాటిట్యూడ్ ఇలా ఉంది..అలా ఉంది అంటూ బిగ్ బాస్ రివ్యూలు ఏరోజుకారోజు ఇచ్చేస్తుంటారు.
ఇంటిల్లిపాదీ చూసే..
ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాదీ కలిసి చూసే రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే అది కేవలం బిగ్ బాస్ మాత్రమే. ఇప్పటికే 7 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షో త్వరలో 8వ సీజన్ తో బుల్లితెర ప్రేక్షకుల సమక్షంలో రానుంది. టీవీలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. మొదట్లో ఈ షోను జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి హీరోలతో చేయించినా నాగార్జున ఇక పర్మినెంట్ గా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
నాగ్ టైమింగ్ సూపర్
నాగార్జున గత సీజన్ లో తన వాగ్దాటితో, కామెడీ టైమింగ్ తో సరదాగా మాట్లాడుతూనే కంటెస్టెంట్లకు క్లాసులు పీకుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. దానితో వారాంతరంలో నాగ్ ఎప్పుడొస్తాడా అని ఎదురూస్తుంటారు అభిమానులు. సరదాగా కంటెస్టెంట్లతో ఆడించే గేమ్స్, వాళ్లకు నిక్ నేమ్స్ పెట్టి ఆడుకుంటూ..మధ్యమధ్యలో కంటెస్టంట్ల మధ్య గొడవలు పెడుతూ ఆద్యంతం కార్యక్రమాన్ని రక్తికట్టిస్తుంటారు.
ఎప్పటికప్పుడు సరికొత్తగా
ఇదంతా నాగార్జు తనదైన శైలిలో చేస్తూ ఏ సీజన్ కా సీజన్ సరికొత్తగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా నాగ్ వేసుకునే డ్రెస్సులకు ఆకర్షితులయ్యే మహిళాభిమానులు కూడా ఉన్నారు. నాగ్ డ్రెస్సుల మీద కూడా కంటెస్టెంట్లు కామెంట్స్ చేస్తుంటారు. చూడటానికి నవ మన్మథుడిలా యంగ్ హీరోలను తలపిస్తూ బిగ్ బాస్ కి మంచి గ్లామర్ తీసుకొస్తున్నారు నాగార్జున. అయితే బిగ్ బాస్ షో కు ఇంత బాగా పాపులారిటీ తీసుకొచ్చిన నాగార్జున రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు అని చాలా మంది సందేహ పడుతుంటారు. దాదాపు పది వారాల పాటు కొనసాగే ఈ బిగ్ బాస్ షో కి వారానికి రెండు రోజుల చొప్పున దాదాపు 20 ఎపిసోడ్ల దాకా నాగ్ పాల్గొంటారు. అయితే గతంలో నాగార్జున రూ.20 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సారి మాత్రం రూ.30 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ఏది ఏమైనా బిగ్ బాస్ నాగార్జున వన్ మేన్ షో అని చెప్పవచ్చు.