BigTV English

Kris Srikkanth on Pandya’s captaincy: అసలు విషయం చెప్పాల్సింది.. పాండ్యా కెప్టెన్సీపై శ్రీకాంత్

Kris Srikkanth on Pandya’s captaincy: అసలు విషయం చెప్పాల్సింది.. పాండ్యా కెప్టెన్సీపై శ్రీకాంత్

Krishnamachari Srikkanth slams bcci selectors over hardik pandya t20i captaincy snub: ఒక క్రీడాకారుడి భవిష్యత్తుతో ఇలా ఆటలాడకూడదని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఇంతకీ తను చెప్పేది ఎవరికోసమంటే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి. తనని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని అన్నాడు.


తనకి ఫిట్ నెస్ లేకపోతే టీ 20 ప్రపంచకప్ ఎలా ఆడతాడని అన్నాడు. అంతకుముందే ఐపీఎల్ కూడా ఆడాడు కదాని అన్నాడు. తనకి తెలిసిన సమాచారం మేరకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫిర్యాదుల కారణంగానే కెప్టెన్ గా తప్పించినట్టు తెలిసిందని అన్నాడు. జట్టులో 15మంది ఆటగాళ్లుంటే, అందరికీ నచ్చినవాడినే కెప్టెన్ గా చేయడం అసాధ్యమని అన్నాడు. మరి పాండ్యాలో ఇంకేమైనా లోపాలుంటే చెప్పాలని అన్నాడు.

కెప్టెన్ అన్నవాడు ఇచ్చిన జట్టుతోనే ఆడాల్సి ఉంటుంది. ఏదో ఒకరిద్దరు అంటే ఓకేగానీ, జట్టంతా వద్దని అనడానికి లేదని అన్నాడు. అటువైపు కోచ్ ఉంటాడు కదా అని అన్నాడు. ఆ కోచ్ కూడా ఎవరో కాదు గౌతం గంభీర్. తనెలాంటివాడో అందరికీ తెలిసిందే. అతని దగ్గర పాండ్యా పప్పులేం ఉడకవని అన్నాడు. ఇన్ని తెలిసి కూడా పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వకుండా అడ్డుకోవడం తప్పు, ఒక క్రీడాకారుడి జీవితంతో ఆటలాడకూడదని అన్నాడు.


Also Read: విరాట్ శాశ్వతంగా లండన్ వెళ్లిపోతున్నాడా?

ఇలా అంటూనే తన గురించి శ్రీకాంత్ చెప్పాడు. నేను కూడా ఒకప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాను. అక్కడ 15 మంది జట్టుని ఎంపిక చేయడం కత్తిమీద సాముగా ఉండేదని అన్నాడు. అయితే 2008లో కెప్టెన్ పై చింత తనకి లేదని అన్నాడు. ఎందుకంటే అప్పుడే ధోనీ వచ్చాడని తెలిపాడు. కానీ ఆటగాళ్ల ఎంపిక చేసేటప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసునని అన్నాడు. నేనిప్పుడు ఆటగాళ్ల విషయం మాట్లాడటం లేదు. కెప్టెన్సీ సంగతే మాట్లాడుతున్నానని అన్నాడు.

శ్రీకాంత్ వ్యాఖ్యలతో మళ్లీ హార్దిక్ పాండ్యా వ్యవహారం నెట్టింట మంట పుట్టించేలా చేసింది. కొందరు కరెక్టే అంటున్నారు. కొందరు బీసీసీఐ ఎంపిక కరెక్ట్ అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×