E-Paper
Advertisement

అనగనగా ఓ సాఫ్ట్ వేర్.. ఉద్యోగం పోయిందని మేడపై గంజాయి మొక్కలు

అనగనగా ఓ సాఫ్ట్ వేర్..  ఉద్యోగం పోయిందని మేడపై గంజాయి మొక్కలు
Advertisement

Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనగానే మనకు గుర్తొచ్చేది లక్షల్లో జీతం, ఏసీ గదుల్లో కూర్చుని చేసే పని. కానీ, దారి తప్పితే ఎంతటి విద్యావంతులైనా సరే ఊహించని ఊబిలో కూరుకుపోతారని నిరూపించింది ఈ ఘటన. హైదరాబాద్‌లోని నాచారంలో వెలుగుచూసిన ఈ ఉదంతం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే యువకుడు గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. అయితే, కొంతకాలం క్రితం తన ఉద్యోగాన్ని వదిలేసిన శశిధర్, ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ముఖ్యంగా గంజాయికి అలవాటు పడటంతో, దాన్ని కొనడానికి భారీగా ఖర్చయ్యేది. చేతిలో ఉద్యోగం లేక, కొనుక్కోవడానికి డబ్బులు సరిపోకపోయేసరికి.. అతను ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. బయట కొనే బదులు తన ఇంటి డాబాపైనే గంజాయి మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు.

Advertisement

పక్కా సమాచారంతో దాడులు చేసిన నాచారం పోలీసులు, అతని ఇంటి మేడపై పెరుగుతున్న 17 గంజాయి మొక్కలను, నిల్వ ఉంచిన సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తన అవసరాల కోసమే వీటిని పెంచుతున్నట్లు నిందితుడు అంగీకరించాడు. చదువుకున్న విజ్ఞానాన్ని మంచి పనులకు వాడాల్సింది పోయి, ఇలా నేరాలకు పాల్పడి కటకటాల పాలవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి శశిధర్‌ను రిమాండ్‌కు తరలించారు.

Also Read: కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×