BigTV English

Bengaluru Crime: యువతిని వివస్త్రను చేసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

Bengaluru Crime: యువతిని వివస్త్రను చేసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

Bangalore crime newsBangalore Crime News: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని చందాపుర హెడ్‌మాస్టర్ లే అవుట్‌ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగో అంతస్తు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూర్యనగర పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టగా కుళ్లిన శవం కనిపించింది. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 5 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఒడిశాకు చెందిన సపన్ కుమార్ ఆ ఇంట్లో నివసించేవాడని పోలీసులు గుర్తించారు. అతడితో కలసి ఆమె ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహం పక్కన మద్యం సీసాలు, సిగరెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె హత్యకు ముందు వారిద్దరూ మద్యం సేవించి ఉంటారని పేర్కొన్నారు.

Also Read: Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు


సపన్ కుమార్ ఫోన్ అందుబాటులో లేదని, ప్రస్ధుతం పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులో సపన్ కుమార్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×