E-Paper
Advertisement

VandeMataram New Guidelines: కేంద్రం కీలక నిర్ణయం.. ‘వందేమాతరం’ తప్పనిసరి, తొలి ఛాయిస్ కూడా

VandeMataram New Guidelines: కేంద్రం కీలక నిర్ణయం.. ‘వందేమాతరం’ తప్పనిసరి, తొలి ఛాయిస్ కూడా
Advertisement

VandeMataram New Guidelines: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోం శాఖ.

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ‘వందేమాతరం’ తప్పనిసరి

Advertisement

వందేమాతర గీతం 150 సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. సామూహిక గానంతోపాటు జాతీయ గీతం అధికారిక వెర్షన్ మొత్తం ప్లే చేయాలంటూ కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగుర వేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్ పాడాలని తప్పనిసరి చేసింది.

ఈ మేరకు ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధలను అమల్లోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు ఇక నుంచి జనగణమన కంటే ముందు జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని పేర్కొంది. ఈ గీతం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ప్రస్తావించింది.

Advertisement

తొలి ఛాయిస్ కూడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అన్నిఅవార్డులు ఇచ్చే సమయం, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం గీతం తప్పనిసరి చేసింది. సినిమా హాళ్లలో ప్రదర్శించాల్సిన అవసరం లేదని అందులో ప్రస్తావించింది. జాతీయ గీతం, గేయం పాడుతున్న సమయంలో ఎవరైనా అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పదని హెచ్చరించింది. అందుకు బాధ్యులైనవారిపై గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించనుంది.

అంతేకాదు ఒకే కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. తొలి ఛాయిస్ వందేమాతరానికి ఇవ్వాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. బంకించంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం గీతాన్ని రచన చేశారు. ప్రస్తుతం వందేమాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఆరు చరణాలు గీతం ( 3 నిమిషాల 10 సెకన్ల) పాడాలని తెలిపింది.

ALSO READ: పార్లమెంట్ వేదికగా పోరు.. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాసం

బంకించంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం గీతాన్ని రచన చేశారు. ఆ తర్వాత ఆనంద్‌మఠ్‌ నవలలో భాగం చేశారు. ప్రస్తుతం వందేమాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఆరు చరణాలు గీతం ( 3 నిమిషాల 10 సెకన్ల) పాడాలని తెలిపింది.

స్వాతంత్య్ర పోరాట సమయంలో ముస్లింలీగ్ అభ్యంతరాల మేరకు ఆరు భాగాల్లోంచి ఎలాంటి మతపరమైన ప్రస్తావనా లేని రెండింటిని ఆనాటి కాంగ్రెస్‌ స్వీకరించింది. ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వం వివాదం లేని తొలి రెండు భాగాలను జాతీయ గేయంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో అధికార-విపక్షాల మధ్య వివాదం రేగింది కూడా.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×