Drug Positive in Hema Blood Sample : బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయింది. తాను ఆ పార్టీకి వెళ్లలేదంటే వెళ్లలేదని బుకాయించిన హేమ.. ఇప్పుడు అడ్డంగా బుక్కయింది. రేవ్ పార్టీలో పట్టుబడిన 150 మంది రక్తనమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపగా.. వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్తనమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ పాజిటివ్ గా వచ్చిన వారిలో హేమ కూడా ఉంది.
తొలుత తాను ఆ పార్టీకి వెళ్లలేదంటూ ఒక వీడియో, వంట చేస్తూ మరో వీడియో, చేసిన వంట ఒక వ్యక్తికి తినిపిస్తూ ఇంకో వీడియో ఇలా వరుస వీడియోలు చేస్తూ వచ్చింది హేమ. తాను బెంగళూరుకు వెళ్లలేని చెప్పేందుకు నానా తంటాలూ పడింది. చివరికి ఆమె బ్లడ్ శాంపిలే అసలు నిజం చెప్పింది. బిగ్ టీవీతో మాట్లాడిన హేమ.. ఇంకా తాను ఆ పార్టీకి వెళ్లలేదనే అంటోంది. మీడియా వాళ్లు తనను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని, తాను ఆ ట్రాప్ లో పడబోనని అంటోంది. కానీ.. హేమ కృష్ణవేణి అనే పేరుతో రేవ్ పార్టీకి వెళ్లినట్లు సమాచారం. హేమతో పాటు వాసు, ఆషిరాయి, చిరంజీవికి కూడా పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులిచ్చి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీపై దాడిచేసింది అక్కడి పోలీసులు కావడంతో.. ఆమె సినీ నటి హేమ అని పోలీసులు గుర్తించలేకపోయినట్లు సమాచారం. తనపేరు కృష్ణవేణి అని చెప్పడంతో.. రికార్డుల్లో అలాగే నమోదు చేసుకున్నారట. కానీ.. కేసు తీవ్రత పెరగడం, వీడియో రిలీజ్, తెలుగు న్యూస్ ఛానల్స్ లో రేవ్ పార్టీలో హేమ ఉండటంపై వార్తలు రావడంతో ఆమె అసలు పేరు హేమగా గుర్తించారట బెంగళూరు పోలీసులు. పేరు తప్పుగా చెప్పి.. తమను తప్పుదారి పట్టించినందుకు హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనం
హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్
నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తింపు
డ్రగ్స్ టెస్టులో మొత్తం 87 మందికి పాజిటివ్‌గా వచ్చిన రిజల్ట్స్#Hema #RaveParty #BangaloreRaveParty pic.twitter.com/Vw32zOS978
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2024