Chai Wala Scam: బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సాధారణంగా చాయ్ అమ్మే వ్యక్తిగా కనిపించే అభిషేక్ కుమార్ ఇంట్లో రూ.1.05 కోట్ల నగదు, 344 గ్రాముల బంగారం, 1.75 కిలోల వెండి, 75 బ్యాంక్ పాస్ బుక్స్, 28 చెక్ బుక్స్, అనేక ఆధార్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇంకా లగ్జరీ కారును గుర్తించారు. చాయ్ స్టాల్ నడుపుతూ సాధారణ జీవితం గడుపుతున్నట్లు నటించిన ఈ వ్యక్తి.. కోట్ల రూపాయల సైబర్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ తన చాయ్ షాప్ పేరుతో.. సైబర్ నెట్‌వర్క్ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరిపేవాడు. అనేక బ్యాంక్ ఖాతాలను మూడో వ్యక్తుల పేర్లతో తెరిచి, వాటి ద్వారా డబ్బు మళ్లింపులు జరిపేవాడు.
బిహార్‌తో పాటు ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో కూడా అభిషేక్ ముఠా చురుకుగా పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆన్‌లైన్ లోన్లు, కస్టమర్ కేర్ స్కామ్‌లు, ఉద్యోగ అవకాశాల పేరుతో మోసాలు, ఇంకా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసేవాడు.
సోదాల్లో ల్యాప్‌టాపుల్లో, పెన్ డ్రైవ్‌లలో ఉన్న డేటా పరిశీలనలో.. సైబర్ మోసాలకు సంబంధించిన లావాదేవీల జాబితా, నకిలీ ఐడీ కార్డులు, ఇంకా 200 కంటే ఎక్కువ బాధితుల వివరాలు బయటపడ్డాయి. అంతేకాకుండా, క్రిప్టో వాలెట్ల ద్వారా జరిగిన డబ్బు మార్పిడుల వివరాలు కూడా లభించాయి.
Also Read: ఆ పని చేస్తే మీ కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పోలీసుల ప్రాథమిక విచారణలో అభిషేక్ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకుని, క్రమంగా వారి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు దొంగిలించేవాడు. సైబర్ నిపుణుల సహకారంతో అతని నెట్‌వర్క్ ఆన్‌లైన్ లో అజ్ఞాతంగా వ్యవహరించేందుకు సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించేవాడు. ప్రస్తుతం అభిషేక్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.