భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం మన బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని చెప్పారు. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేదని వార్నింగ్ ఇచ్చారు. లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన మొదటి బ్యాచ్ మిస్సైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి వంటిదని ఆయన తెలిపారు. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారని, బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులకు అసాధ్యం అని చెప్పారు.
ब्रह्मोस सिर्फ़ एक मिसाइल नहीं, बल्कि भारत की बढ़ती हुई स्वदेशी रक्षा क्षमता और आत्मनिर्भरता का प्रतीक है। आज ब्रह्मोस भारतीय थलसेना, नौसेना और वायुसेना तीनों की रीढ़ बन चुका है।
‘ऑपरेशन सिंदूर’ ब्रह्मोस का सिर्फ़ ट्रेलर भर था। पाकिस्तान की एक-एक इंच ज़मीन ब्रह्मोस की पहुँच में… pic.twitter.com/D6c0KtBIg0
— Rajnath Singh (@rajnathsingh) October 18, 2025
ట్రైలర్ మాత్రమే..
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా చూడాలని పాకిస్తాన్ ఉబలాటపడితే వారికి తిప్పలు తప్పవని హెచ్చరించారు రాజ్ నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ టైమ్ లో కూడా భారత్ బ్రహ్మోస్ క్షిపణనులను ఉపయోగించింది. అధునాతన రక్షణ వ్యవస్థ మనకు అండగా నిలిచింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ కే కాదు, ఇతర ప్రపంచ దేశాలకు కూడా భారత సైనిక సామర్థ్యం స్పష్టమైంది. భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. తమ శక్తి ఏంటో ట్రైలర్ లోని క్లియర్ గా చూపించామని, విజయం మనకు అలవాటైపోయిందని చెప్పారు రాజ్ నాథ్ సింగ్.
ఆత్మ నిర్భరతకు నిదర్శనం..
భారత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), -రష్యాకు చెందిన NPOM సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణనులను అభివృద్ధి చేస్తున్నాయి. రష్యాతో సంయుక్తంగా వీటిని తయారు చేస్తున్నా.. బ్రహ్మోస్ లో 75 శాతం మన స్వదేశీ భాగాలు ఉపయోగించడం విశేషం. దీన్ని ఆత్మనిర్భర్ లక్ష్యంలో భాగమని తెలిపారు రాజ్ నాథ్ సింగ్. భారత రణక్షణ వ్యవస్థలోని త్రివిధ దళాలు ఈ క్షిపణనులను ఉపయోగించుకుంటున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, నాగ్‌పూర్‌లలోని DRDO కేంద్రాలలో ఈ క్షిపణుల విడిభాగాలు తయారవుతున్నాయి. ఇటీవల లక్నోలో కొత్త యూనిట్ ప్రారంభించారు.
Also Read: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య
బ్రహ్మోస్ మిస్సైల్స్‌ను ఆపరేషన్ సిందూర్ లో మనం ప్రయోగించాం. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్. అంటే లక్ష్యాన్ని నిర్దేశించి మనం ప్రయోగిస్తే.. అత్యంత కచ్చితత్వంతో దాన్ని చేరి విధ్వంసం చేయగల సామర్థ్యం దీనిసొంతం. ఒకసారి లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తే, ఆ తర్వాత లక్ష్యాన్ని చేరడంలోనూ, చేరిన తర్వాత విధ్వంసం సృష్టించడంలోనూ మానవ ప్రమేయం ఉండదన్నమాట. ఈ అత్యాధునిక ఆయుధం భారత సైనిక సంపత్తిలో ఒక ప్రధాన అస్త్రంగా మారింది. పాకిస్తాన్ గురించి చెప్పుకోవాలంటే పాక్ ఆయుధ సామర్థ్యం ఏంటో ఆపరేషన్ సిందూర్ వేళ తేలిపోయింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను మనం తుత్తునియలు చేశాం, అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం మన అస్త్రాలను తప్పించుకోలేకపోయింది. నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టం మరింత పెరగకముందే కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ ని నిలిపివేసింది.
Also Read: వర్మ జీరో కాదు, హీరోనే..