E-Paper
Advertisement

Odisha Athletes: రైలులో టాయిలెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించిన అథ్లెట్లు.. ఇదేనా వారికి ఇచ్చే గౌరవం?

Odisha Athletes: రైలులో టాయిలెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించిన అథ్లెట్లు.. ఇదేనా వారికి ఇచ్చే గౌరవం?
Advertisement

Odisha Athletes: ఒడిశాకు చెందిన యువ అథ్లెట్లు రైలులో టాయిలెట్ వద్ద కూర్చొని ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 18 మంది ఒడిశాకు చెందిన స్కూల్ లెవల్ అథ్లెట్లు.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే వారికి కన్ఫార్మ్ టికెట్లు లేకపోవటంతో జనరల్ కంపార్ట్మెంట్, రైలు మరుగుదొడ్డి వద్ద నేలపై కూర్చొని ప్రయాణించాల్సి వచ్చింది. ఈ టీమ్ లో మొత్తం 10 మంది బాలురు, ఎనిమిది మంది బాలికలు ఉన్నారు.

టాయిలెట్ల వద్ద ప్రయాణం

తీవ్రమైన చలిలో యువ అథ్లెట్లు రైలు టాయిలెట్ల దగ్గర కూర్చోవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఈవెంట్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను ఇలాగేనా చూసుకునేది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే టోర్నమెంట్ పూర్తైన తర్వాత కూడా వారికి ఇబ్బందులు తప్పలేదు. ఒడిశాకు తిరుగు ప్రయాణంలో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పలేదు. అథ్లె్ట్ల ప్రయాణానికి టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో.. ప్లేయర్లు జనరల్ కోచ్‌లలోకి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. క్రీడాకారులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటు విమర్శిస్తున్నారు.

Advertisement

అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకులను జట్టుతో ప్రయాణించడానికి అనుమతించలేదని సమాచారం. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. యువ అథ్లెట్లు సుదీర్ఘ ప్రయాణాలలో పెద్దల పర్యవేక్షణ లేకుండా ఉండకూడదని నెటిజన్లు అంటున్నారు.

ఒడిశాలో చర్చనీయాంశం

Advertisement

ఈ ఘటనపై ఒడిశాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. తల్లిదండ్రులు, క్రీడా ప్రేమికులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు వస్తున్నప్పటికీ ఒడిశా ప్రభుత్వం ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోతి పట్నాయక్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అథ్లెట్లకు కనీస సౌకర్యాలను అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. క్రీడలను ప్రోత్సహించడం గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుందని తప్ప ఆచరణ లేదని ఆరోపించారు. యువ అథ్లెట్లకు కనీసం ట్రైన్ టికెట్లు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.

Also Read: Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×