BigTV English

Operation Sindoor : మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలిసిందా? మొనగాడ్రా బుజ్జీ..

Operation Sindoor : మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలిసిందా? మొనగాడ్రా బుజ్జీ..

Operation Sindoor : వెళ్లు. వెళ్లి మోదీకి చెప్పు. ఇదీ పొగరుబోతు తీవ్రవాది కొట్టిన డైలాగ్. వాడు యధాలాపంగా అన్నాడో.. కావాలని అన్నాడో కానీ.. ఆ మహిళ అలానే చేసింది. నేరుగా మోదీకే చెప్పింది. తన భర్తను తన కళ్ల ముందే కాల్చి చంపారని.. ఆ ఉగ్రమూకను వదిలిపెట్టొద్దని కోరింది. అది కేవలం ఆ మహిళ మాత్రమే చెప్పిన మాట కాదు. భారతమాతే.. మోదీని కోరినట్టు అనిపించింది. ఆనాడే ప్రధాని ప్రామిస్ చేశారు. భూమి అంచుల వరకూ వేటాడుతాం.. ట్రాక్ చేసి.. ఊహకు అందని రీతిలో శిక్షిస్తాం.. అని అభయమిచ్చారు. చెప్పినట్టే చేసి చూపించారు. సరిహద్దులు దాటెళ్లి మరీ.. ఉగ్రవాద స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డారు. ఏకంగా 9 టెర్రరిస్ట్ డెన్‌లపై అటాక్ చేశారు. బాంబులతో బస్మం చేసి పడేశారు. సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.


భరతమాత నుదిటిపై సిందూరం

ఆపరేషన్ సిందూర్. ఈ పేరు స్వయంగా ప్రధాని మోదీనే పెట్టారని అంటున్నారు. పేరులోనే మొత్తం మెసేజ్ కనిపిస్తోంది. ఇది పహల్గాం దాడుల్లో భర్త, కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళల నుదిట పెట్టిన సిందూరం. భరతమాత బిడ్డల రక్తం కళ్లజూసిన ముష్కరులను వెంటాడి, వేటాడి.. ఆ ఉగ్రవాదుల రక్తంతో భరతమాత నుదిట అలంకరించిన సిందూరమే ఈ ఆపరేషన్. పాక్ గడ్డపై మోదీ చేసిన ఈ రక్త సంతకం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టేలా ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. యుద్ధం చేస్తామని చెప్పి మరీ.. పాక్ ఇంటికెళ్లి చావగొట్టేసి వచ్చారు. అందుకే అంటున్నారు.. మోదీ పాలనలో ఇండియా మరో ఇజ్రాయెల్ అయిందని.


మోదీకి చెప్పు.. చెబితే ఇట్టా ఉంటాది..

ఏప్రిల్ 22. బైసరన్ లోయలో ఆనందంగా గడుపుతున్నారు పర్యాటకులంతా. మధ్యాహ్నం తర్వాత విరుచుకుపడింది నలుగురు సభ్యుల ఉగ్రమూక. హిందువులను, ముస్లింలను వేరు చేశారు. మతం అడిగి, కల్మా చదవమని మరీ.. హిందువులేనని కన్ఫామ్ చేసుకుని కాల్చి చంపేశారు. మహిళలు, పిల్లలను వదిలేసి.. పురుషులను మాత్రమే టార్గెట్ చేశారు. హిమాన్షి, వినయ్ నర్వాల్ ఉదంతం మరీ ఘోరం. ఆరు రోరజుల క్రితమే వాళ్లకు పెళ్లైంది. వినయ్ నేవీ ఆఫీసర్. హనీమూన్‌కు పహల్గాం వచ్చారు. భార్య ముందే భర్త నుదిటిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఫైరింగ్ చేశారు. తననూ చంపేయమని ఆమె వేడుకున్నా వినలేదు. వెళ్లి మోదీకి చెప్పు.. అంటూ నిర్లక్ష్యంగా, వెటకారంగా బదులిచ్చాడు ఆ మతోన్మాది. అందుకు ఇప్పుడు గట్టి బదులే ఇచ్చారు మన మోదీ.

మోదీ మొనగాడ్రా బుజ్జీ..

మోదీ మగాడ్రా బుజ్జీ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. టెల్ మోదీ.. ఐ టోల్డ్ మోదీ.. అనే ఇమేజ్ వైరల్ అవుతోంది. మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో ఇప్పుడు తెలిసొచ్చిందా పాకిస్తాన్? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఉగ్రవాదులు చెప్పినట్టుగానే.. తన భర్తను దారుణంగా చంపిన ఉదంతాన్ని మోదీకి చెప్పింది హిమాన్షి. మోదీ విన్నారు. నేనున్నానన్నారు. బుల్లెట్‌కు బుల్లెట్. దాడికి దాడి. గట్టిగా బదులిచ్చారు. ఉగ్రవాదుల ఇంటికెళ్లి మరీ బాంబులేసి వచ్చారు. ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్, టాప్ లీడర్స్‌ను హతమార్చారు. పహల్గాంలో 26 మంది హిందువులను చంపిస్తే.. అంతకు మూడింతలు ఉగ్రవాదులను పీస్ పీస్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ. పక్కా ప్లాన్‌తో.. వరుస రివ్యూలతో.. చెప్పి మరీ అటాక్ చేసిన మొనగాడు మన మోదీ. ఎనీ డౌట్స్?

Also Read : లైవ్‌లో బోరున ఏడ్చేసిన పాక్ టీవీ యాంకర్

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×