BigTV English

Pak TV Anchor Cries: భారత్ ప్రతీకారం.. కన్నీరు పెట్టుకున్న పాక్ టీవి యాంకర్

Pak TV Anchor Cries: భారత్ ప్రతీకారం.. కన్నీరు పెట్టుకున్న పాక్ టీవి యాంకర్

Pak TV Anchor Cries| జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ కఠినంగా స్పందించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన “ఆపరేషన్‌ సిందూర్‌”లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత వైమానిక దాడులపై పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ దాడిపై ఈ క్రమంలో ఒక పాకిస్తానీ టీవి యాంకర్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ మహిళా అమాయకులను చంపినందుకు తమను క్షమించమని కోరుతోంది.


ట్విట్టర్ ఎక్స్ లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాకిస్తానీ టీవి యాంకర్ ఏడుస్తూ.. ‘అమాయకులను చంపేస్తున్నారు. దేవుడా కాపాడు అని వేడుకుంటోంది.’ అయితే ఈ యాంకర్ వీడియో ఏ సందర్బంలోనిది తెలియనప్పటికీ.. కొందరు నెటిజెన్లు మాత్రం ఆమె అసలు కన్నీరు పెట్టుకోవడం లేదని కామెంట్ చేయగా.. ఆమె తీసుకున్న డబ్బుల కంటే మరీ ఎక్కువగా నటిస్తోందని మరొకరు రాశారు. ఇంకొక యూజర్ అయితే పాకిస్తాన్ పై ఆ దేవుడు కూడా కోపంగా ఉన్నాడు. అని రాశాడు.

అయితే ఆ వీడియోలో ఆ పాకిస్తానీ అందమైన మహిళా యాంకర్ ఏడుస్తూ ఇలా అన్నది. “అమాయకులు వీరమరణం పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యుల నుంచి నేను ఒక్కటే కోరుకుంటున్నా. చనిపోయిన మీ ఆప్తులు ఆ దేవుడి వద్దకు వెళ్లి మా(పాకిస్తాన్) గురించి ఫిర్యాదు చేయవద్దు అని చెప్పండి. మేము (పాకిస్తానీలు) మరిచిపోయాం. మానవులంతా ఒక్కటే అని విషయాన్ని మేమంతా మరచిపోయాం. మా లాంటి అవినీతి మనస్తత్వం కలిగిన వారిని క్షమించమని ప్రార్థించండి. మేమంతా దారితప్పింపోయాం.” అని చెప్పింది. ఆమె మాటలను బట్టి ఉగ్రవాదులు అమాయాకులను చంపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తోంది.


Also Read: భారత పౌరులను చంపిన పాక్ ఆర్మీ.. జమ్మూలో 8 మంది అమాయకులు మృతి

ఇక, సామాన్య ప్రజలు కూడా ఆపరేషన్‌ సిందూర్‌కు విశేషంగా స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు భారత సైన్యాన్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా.. ఆపరేషన్‌ సిందూర్‌పై పహల్గాం దాడిలో తన కుమారుడిని కోల్పోయిన శుభమ్‌ ద్వివేది తండ్రి సంజయ్‌ ద్వివేది మాట్లాడుతూ.. ‘‘భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఉదయం నుంచీ నేను నిరంతరం వార్తలపై కన్నేసి ఉన్నాను. దేశ ప్రజల మనోభావాలను గుర్తించి పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దాడుల వార్త విన్నప్పటి నుంచే మా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది’’ అని చెప్పారు.

అలాగే.. సంతోష్ జగ్‌దలే భార్య ప్రగతి జగ్‌దలే మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరు వినగానే నా కళ్లలో ఆపని నీళ్లు తిరిగాయి. ఉగ్రవాదులు మా కుమార్తెల సిందూరం తుడిచిపెట్టారు. దానికి ఇదే సరైన ప్రతీకారం. ప్రభుత్వానికి నా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.

సంతోష్ జగ్‌దలే కుమార్తె అశ్విరి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌లో తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మెరుపుదాడులకు దిగింది. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరు కూడా ఈ దాడికి గల నేపథ్యాన్ని స్పష్టంగా తెలిపింది. మా కన్నీళ్లు ఆగడంలేదు. ఉగ్రవాదులు ఎందరో సోదరీమణుల జీవితం నాశనం చేసినందుకు, వారు సిందూరం కోల్పోయినందుకు గుర్తుగా ఈ దాడికి ఈ పేరు పెట్టారు. ఒకవైపు బాధ ఉన్నా.. మేము ఇప్పుడు గర్వంగా, ఆనంద బాష్పాలు పెడుతున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా మా ప్రతీకారం తీర్చుకుంటారని మేము నమ్ముతున్నాం’’ అని చెప్పారు.

Related News

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×