BigTV English

PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..

PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు పడేది ఆ రోజే..
PM Kisan 16th Installment Ddate Announced: రైతులకి కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 16 వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధి దారులకు చెల్లిస్తున్నట్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ పేర్కొంది. రైతులకు ఆర్దికంగా నిలిచేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రైతులకు కేంద్రం ఏటా రూ. 6 వేలు అందిస్తుంది. ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మొత్తం 3 విడతలగా 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది.
పీఎం కిసాన్ పథకానికి అర్హులు ఎవరంటే..

పీఎం కిసాన్ పథకానికి రైతులు మాత్రమే అర్హులు.


పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే..

పీఎం కిసాన్ 16వ విడత ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్ 16 వ విడత డిపాజిట్ అయ్యిందా? లేదా? అని ఎలా చెక్ చేసుకోవాలంటే..
1. అర్హులైన రైతులు https://pmkisan.gov.in/portal పీఎం సమ్మాన్ నిధి అధికార పోర్టల్ లోకి వెళ్లాలి.
2. హోమ్ పేజీలో కార్నర్ ను ఎంపిక చేసుకోవాలి.
3. పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
4. ఆధార్ లేదా ఫోన్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ సెలక్ట్ చేసుకోవాలి.
5. గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనబడుతుంది.


Read More: అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్‌తో రూ.100 కోట్లు..!

పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ పథకానికి నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ ని తప్పని సరి చేసుకోవాలి. ఈ కేవైసీ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు.

అంతే కాకుండా కేంద్రం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని నేరుగా రైతులకు అందించేల ఈకేవైసీని ప్రవేశపెట్టింది. ఇలా చేయడం వల్ల మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులను డిపాజిట్ చేస్తుంది.

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×