E-Paper
Advertisement

PM Modi: ఆర్టికల్ 370 గోడను బద్దలుగొట్టాం.. ప్రతిదానికీ ఒకే కుటుంబం పేరు: ప్రధాని మోదీ

PM Modi: ఆర్టికల్ 370 గోడను బద్దలుగొట్టాం..  ప్రతిదానికీ ఒకే కుటుంబం పేరు:  ప్రధాని మోదీ
Advertisement

PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా యూపీలోని లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రేరణ స్థల్‌లో బీజేపీ-జనసంఘ్‌లోని ముగ్గురు అగ్ర నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీల భారీ విగ్రహాలను ఆవిష్కరించారు. లక్నోలోని వసంత కుంజ్ ప్రాంతంలోని 65 ఎకరాల పార్క్ లో ఈ భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ.. మ్యూజియంను ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

ప్రతి దానికీ ఒకే కుటుంబం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. “ఆర్టికల్ 370 గోడను కూల్చివేసే” అవకాశం రావడం బీజేపీ ప్రభుత్వానికి గర్వంగా ఉందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సృష్టించిన సుపరిపాలన ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రతి సానుకూల విజయాన్ని ఒకే కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రభుత్వ పథకాలు వివక్ష లేకుండా పేదలందరికీ చేరేలా చూడటం కోసం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ దార్శనికతను బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014కి ముందు, దాదాపు 25 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల కింద ఉన్నారని, నేడు ఈ సంఖ్య 95 కోట్లకు పెంచామని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రేరణ స్థల్ ప్రత్యేకతలు

  • 65 ఎకరాల్లో రూ.230 కోట్ల వ్యయంతో భారీ విగ్రహాలను ప్రతిష్టించారు.
  • వసంత కుంజ్ పార్కులో 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.
  • బీజేపీ-జనసంఘ్‌ ముఖ్య నేతల జీవిత చరిత్రల ఆధారంగా మ్యూజియం ఏర్పాటు చేశారు.
  • ఈ పార్కులో వినోద కేంద్రం, ధ్యాన కేంద్రం, విశ్రాంతి కేంద్రం, యోగా కేంద్రం, అన్నదానసత్రం ఉంది.
Advertisement

Also Read: Atal Canteen: రూ.5కే ఫుల్ మీల్స్.. ఎక్కడో తెలుసా? ఇందులో వడ్డించే ఐటెమ్స్ ఇవే!

మ్యూజియం ఎలా ఉంది?

  • లోటస్ ఆకారంలో ఉన్న ఈ మ్యూజియం 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
  • ప్రముఖ శిల్పులు శ్రీరామ్ సుతార్, మంతురామ్ ఈ విగ్రహాలను, మ్యూజియంను రూపొందించారు.
  • పార్కులో ప్రజలు తిరగడానికి 1.7 కిలోమీటర్ల పొడవైన సింథటిక్ ట్రాక్ నిర్మించారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×