E-Paper
Advertisement

Atal Canteen: రూ.5కే ఫుల్ మీల్స్.. ఎక్కడో తెలుసా? ఇందులో వడ్డించే ఐటెమ్స్ ఇవే!

Atal Canteen: రూ.5కే ఫుల్ మీల్స్.. ఎక్కడో తెలుసా? ఇందులో వడ్డించే ఐటెమ్స్ ఇవే!
Advertisement

Atal Canteen: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. దేశ రాజధానిలో 45 ‘అటల్ క్యాంటీన్ల’ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం అందిస్తున్నారు. రూ.30 విలువ చేసే భోజనాన్ని సబ్సిడీగా ప్రభుత్వం రూ.5 అందిస్తుందని దిల్లీ సీఎం తెలిపారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. రోజువారీ కూలీలు, కార్మికులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు తక్కువ ధరకే భోజనం అందించే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు దిల్లీ సీఎం. ప్రతి క్యాంటీన్‌లో సుమారు 1,000 మందికి రోజుకు రెండు పూటలా భోజనం అందజేస్తామన్నారు.

అటల్ క్యాంటీన్ మెనూ

అటల్ క్యాంటీన్లలో.. పప్పు, అన్నం, చపాతీ, కూర, పచ్చడి తాజాగా అందిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి దిల్లీలో ప్లేట్ భోజనం రూ. 500 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. ప్రతిరోజూ రెండు పూటలా ప్రెష్ భోజనాలు.. రెస్టారెంట్ ధరలో పదో వంతుకు అందజేస్తున్నారు. దిల్లీ ప్రభుత్వం ఇవాళ ‘అటల్ క్యాంటీన్’ పథకాన్ని ప్రారంభించింది. నగరంలోని 100 ప్రదేశాలలో ప్లేట్‌కు కేవలం 5 రూపాయలకే పోషకమైన భోజనం అందిస్తున్నారు.

అటల్ క్యాంటీన్ -ప్రదేశాలు, టైమ్

Advertisement

దిల్లీ ప్రభుత్వం నగరంలోని 45 అటల్ క్యాంటీన్లకు ప్రారంభించింది. ఆర్‌కే పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరి గార్డెన్, నరేలా, బవానా, ఇతర ప్రదేశాలు ప్రస్తుత క్యాంటీన్లు ఓపెన్ చేశారు. త్వరలో మరో 55 చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు దాదాపు 1000 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

Also Read: Pune Municipal Elections: మాకు ఓటేస్తే థాయ్‌లాండ్‌ ట్రిప్, కారు ఫ్రీ! పుణె ఎన్నికల్లో ‘తాయిలాల’ జాతర

డిజిటల్ టోకెన్లు

Advertisement

దిల్లీ ప్రభుత్వం చేపట్టిన అటల్ క్యాంటీన్లకు.. మాన్యువల్ కూపన్ల స్థానంలో డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సీసీకెమెరాల ద్వారా దిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కేంద్రాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×