E-Paper
Advertisement

మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్

మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

దేశ స్వాతంత్ర్య సంగ్రామం నాటి నుండి నేటి వరకు సేవదళ్ అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన సేవదళ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని బీజేపీ తీరుపై రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సేవదళ్ శ్రేణులు సమర్థవంతంగా ఎండగడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ విలువల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీ పద్ధతులను ఆయన తప్పుబట్టారు. దేశాభివృద్ధి కన్నా అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని ఎద్దేవా చేశారు. సొంత కూతురు కవిత అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం పదవుల కోసం పాకులాడుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందని వారు ప్రజల కష్టాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పౌరుల ఆకాంక్షలను పక్కనబెట్టి కుటుంబ రాజకీయాలకు పెద్దపీట వేయడం వల్లనే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని విశ్లేషించారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఈ చారిత్రాత్మక ఘనత కేవలం సోనియా గాంధీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను నిజం చేసేందుకు సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తే కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇక ఏమాత్రం భవిష్యత్తు లేదని పదేళ్లు ఆదరించిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.

తెలంగాణ పునర్నిర్మాణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని వెల్లడించారు. సేవదళ్ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

ALSO READ: కులవృత్తుల పాలిట శాపంగా రేవంత్ సర్కార్ పాలన.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×