E-Paper
Advertisement

Hiraben Modi: తల్లి పాడె మోసిన ప్రధాని..

Hiraben Modi: తల్లి పాడె మోసిన ప్రధాని..
Advertisement

Hiraben Modi:ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
తల్లి హీరాబెన్ మృతితో శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ కు బయలుదేరారు ప్రధాని మోదీ. అక్కడినుంచి గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ తల్లి అంతిమయాత్రలో పాల్లొన్నారు. తన తల్లి భౌతికకాయానికి నివాళులర్పిచారు. అనంతరం అంతిమయాత్రలో భాగంగా తానే స్వయంగా తన తల్లి పాడెను మోశారు ప్రధాని మోదీ.

తల్లి హీరాబెన్‌ మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని అన్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×