BigTV English

Condolence on Ramoji Rao Death: రామోజీరావు అస్తమయంపై మోదీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రాజకీయ ప్రముఖుల సంతాపం

Condolence on Ramoji Rao Death: రామోజీరావు అస్తమయంపై మోదీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రాజకీయ ప్రముఖుల సంతాపం

Modi and Others Condolence on Ramoji Rao Death: ఈనాడు సంస్థల చైర్మన్, అక్షర యోధుడు రామోజీరావు.. తీవ్ర అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీలోకంలో విషాదం అలుముకుంది. రామోజీ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


నరేంద్ర మోదీ..

బీజేపీ అగ్రనేత నరేంద్రమోదీ రామోజీరావు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని X వేదికగా ట్వీట్ చేశారు. పత్రికారంగంలో ఆయన సరికొత్త ప్రమాణాలు చేశారని, ఆయన రచనలు, జర్నలిజం, చలనచిత్రాలు.. ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయని కొనియాడారు. మీడియా, వినోద రంగాల్లో చేసిన ఆవిష్కరణలు అందరినీ అలరించాయన్నారు. దేశ అభివృద్ధిపట్ల ఆయనెంతో ఆసక్తిని కనబరిచేవారని, అలాంటి వ్యక్తిని కలిసి మాట్లాడినందుకు తాను అదృష్టవంతుడినని తెలిపారు. రామోజీరావును కోల్పోయిన అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు మోదీ.


రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

రామోజీరావు మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి చెందారు. ఆయన మరణం మీడియాకు తీరని లోటన్న ఆమె.. మీడియా, వినోద రంగాలు ఒక టైటాన్ ను కోల్పోయాయని తెలిపారు. ఈనాడు పత్రిక, ఈటీవీ న్యూస్ నెట్ వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థల్ని స్థాపించిన రామోజీరావు.. ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని, అందరికీ ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Also Read: RamojiRao Passed Away : బ్రేకింగ్.. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత

సీఎం రేవంత్ రెడ్డి..

రామోజీరావు మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన లోని లోటు జర్నలిజానికి ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువల్ని జోడించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్..

రామోజీరావు మృతిపట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు ఎనలేని సేవలను అందించారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.

Also Read: Ramoji Rao Funeral at Ramoji Film City: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. ఆయనొక తెలుగు వెలుగని కొనియాడిన చంద్రబాబు.. రామోజీరావు మృతి తీరని లోటన్నారు. రామోజీరావు మరణవార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి.. అసామాన్య విజయాలు సాధించారని కొనియాడారు. ఆయనకు అనారోగ్యంగా ఉందన్న వార్త విన్నాక కోలుకుంటారని అనుకున్నానని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి రామోజీరావు మృతి పత్రికాలోకానికి తీరని లోటని పేర్కొన్నారామె. తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లు రామోజీరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

వెంకయ్యనాయుడు..

వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగి.. రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి ప్రపంచానికి తెలుగువారి ఘనతను చాటిన వ్యక్తుల్లో రామోజీ ఒకరిగా నిలిచారని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారాయన. తెలుగు బాష-సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణయమని, రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతే గుర్తొస్తుందన్నారు. ఆయన వ్యక్తి కాదు.. శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. రామోజీరావు మృతితో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read: Ramojirao Funeral: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..

రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని). ఆయన లేనిలోటు తీరనిదని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరిటాల శ్రీరామ్, సునీత, బాలశౌరి, సీపీఐ నారాయణ తదితరులు సంతాపం తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్..

అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించి.. పత్రిక, మీడియా, టెలివిజన్ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన రామోజీరావు తెలుగు జాతీకి గర్వకారణంగా నిలిచారన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన జీవితమంతా.. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో బ్రతికారని, ఏ పనైనా విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా చేసేవారన్నారు. అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరంగా ఉందన్నారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రామోజీరావు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని X వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో దేవుడు వారి కుటుంబానికి అండగా నిలవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్

మల్లికార్జున్ ఖర్గే..

కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రామోజీ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. X వేదికగా ఆయన మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. పద్మ విభూషణ్ గ్రహీత అయిన రామోజీరావు జర్నలిజం, వినోదరంగంలో చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×