Vivo Y500 Pro| శాంసంగ్, ఆపిల్ కంపెనీలకు చెక్ పెట్టి భారత దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఫోన్లు వివో బ్రాండ్ చెందినవని తాజా రిపోర్ట్ లో తేలింది. ఇదే జోష్ తో వివో సరికొత్త మోడల్ తో మళ్లీ సంచలనం సృష్టించింది. మిడ్ రేంజ్ లో కొత్త వివో Y500 ప్రో ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో ప్రీమియం ఫోన్లకు ధీటుగా హై-రిజల్యూషన్ ప్రైమరీ కెమెరా, చాలా పెద్ద బ్యాటరీ కూడా ఉండడం ప్రత్యేకం. ఈ కొత్త మోడల్ మిడ్-రేంజ్ ప్రైస్‌లో అద్భుత వాల్యూ ఇస్తుంది. చైనాలో ఈ కొత్త వివో ఫోన్ లాంచ్ అయింది. IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెంట్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌తో పనిచేస్తుంది. ఆరిజిన్‌ఓఎస్ 6తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్.
ఇందులో నాలుగు స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్ 8GB RAM ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర CNY 1,799 (భారత కరెన్సీలో సుమారు రూ.22,400). 8GB RAM + 256GB – CNY 1,999 (రూ.24,900). 12GB RAM + 256GB – CNY 2,299 (రూ.28,600). టాప్ మోడల్ 12GB RAM + 512GB – CNY 2,599 (రూ.32,400).
నాలుగు స్టైలిష్ కలర్స్: ఆస్పిషియస్ క్లౌడ్, సాఫ్ట్ పౌడర్, లైట్ గ్రీన్, టైటానియం బ్లాక్. గ్లాస్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో అందంగా ఉంటుంది.
ఫోన్‌లో సూపర్. 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. 1.5కే రిజల్యూషన్ (2800 x 1260 పిక్సెల్స్). 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 5,000 నిట్స్. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గేమింగ్, వీడియోలు చూడటానికి సూపర్ గా ఉంటుంది.
పర్ఫామెన్స్, ప్రాసెసింగ్ పవర్ బాగుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్ తో ఫోన్ రన్ అవుతుంది. గేమింగ్‌లో బలమైన పర్ఫామెన్స్ ఇస్తుంది. డైలీ టాస్కులు సులభంగా మేనేజ్ అవుతాయి. 12జీబీ ర్యామ్‌తో మల్టీటాస్కింగ్ స్మూత్ గా ఉంటుంది. డ్యూయల్ SIM సపోర్ట్. మోబ గేమ్స్‌లో 120fps వరకు సపోర్ట్. హెవీ యూజర్స్‌కు ఈ ఫోన్ పర్ఫెక్ట్.
వివో Y500 ప్రోలో అద్భుతమైన అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్, డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. మెయిన్ 200MP శాంసంగ్ HP5 సెన్సార్, f/1.88 ఏపర్చర్‌తో OIS. డెప్త్ 2MP కెమెరా పోర్ట్రెయిట్ షాట్స్‌కు సహాయం. ఫ్రంట్ 32MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేయడానికి బాగుంటుంది. లో-లైట్ పెర్ఫామెన్స్, డీటెయిల్స్ సూపర్. ఫోటోగ్రఫీ లవర్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.
బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్ లో ఈ ఫోన్ టాప్. 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. హెవీ యూజ్‌లో కూడా రోజు మొత్తం నడుస్తుంది. 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్. కొన్ని నిమిషాల్లో ఫుల్ ఛార్జ్. పవర్ బ్యాంక్ అవసరమే ఉండదు.
5G, బ్లూటూత్, వై-ఫై సపోర్ట్. USB టైప్-C పోర్ట్. GPS, OTG. స్క్రీన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్. ఇతర సెన్సార్స్: గైరోస్కోప్, ఈ-కాంపాస్, ప్రాక్సిమిటీ, గ్రావిటీ. సింగిల్ స్పీకర్.
ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో వస్తుంది. దీని కొలతలు.. 160.23 × 74.51 × 7.81 mm. వెయిట్ 198 గ్రాములు. కంఫర్టబుల్ హోల్డ్. రౌండ్ కెమెరా మాడ్యూల్ అందంగా ఉంది.
మొత్తంగా వివో Y500 ప్రో ఇంప్రెసివ్ స్పెస్. 200MP కెమెరా, పెద్ద బ్యాటరీ స్టాండ్ అవుట్. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ కాంటెండర్. చైనాలో అందుబాటులో ఉంది. ఇండియాలో 2026లో రావచ్చు. కేవలం రూ.22400లకే ప్రీమియం రేంజ్ అనుభూతిని ఈ ఫోన్ ఇస్తుంది. గేమింగ్, ఫోటోగ్రఫీ, డైలీ యూజ్ అన్నీ ఎంజాయ్ చేయవచ్చు. వివో ఫ్యాన్స్ ఈ ఫోన్ అసలు మిస్ చేయకోవద్దు.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే