Gundeninda GudiGantalu Today episode November 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి అత్త గిఫ్ట్ ను కొట్టేయాలని అనుకుంటుంది.. మీ ఇంట్లో పాత సామాన్లు చాలానే ఉన్నాయి కదా.. అందులో ఓ పాత టీవీ ఉంది కదా దాని అట్ట కూడా అలానే ఉంది అని కామాక్షి అంటుంది. అయితే ఆ టీవీ నాకు ఇవ్వు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో ఇస్తే దాంట్లో నీకు కూడా ఇస్తాను అని ప్రభావతి అంటుంది. కామాక్షి మొదటి షాక్ అయిన కూడా ఆ తర్వాత ప్రభావతికి టీవీ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది.. మొత్తానికి ప్రభావతి తన అత్తగారిని బుట్టలో వేసుకొని ఎందుకు టీవీని ఇవ్వాలని అనుకుంటుంది. మీనా బామ్మ పుట్టినరోజు వేడుకలను వీడియో తీస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని సత్యం అడుగుతాడు. సుశీల గురించి మీనా ఒక వీడియోని రికార్డ్ చేస్తుంది.. అక్కడ ఎమోషనల్ అవడంతో మీనా కూడా ఎమోషనల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రవి శృతి ఇద్దరూ గుడి దగ్గర మౌనికను చూసి ఆగి మాట్లాడతారు. ఈరోజు బామ్మ పుట్టినరోజు కదా.. నువ్వు కూడా రావాలి నానమ్మ ఇంత దూరం వచ్చింది కదా నువ్వు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది అని రవి శృతి ఇద్దరు పిలుస్తారు. దానికి వాళ్ళ అత్తయ్య ఒప్పుకుంటుంది.. సుశీల ఏం జరిగింది ఈ ప్రభావతి వాడిని ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఈవిడ గారు అనని రోజు ఎప్పుడు ఉండదు లేండి అమ్మమ్మ వాళ్ళిద్దరికీ కొత్తేమి కాదు అని మీనా అంటుంది.. బాలు కోసం సుశీల వెయిట్ చేస్తూ ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్ళాడు అని మీనా అని పదేపదే అడుగుతూ ఉంటుంది. మీనా కూడా నాకు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. అని ఆలోచిస్తూ ఉంటుంది..
ఇక రోహిణి సుశీలకు ఎలాగైనా సరే మేకప్ వేయాలని అనుకుంటుంది.. ఈరోజు మీ పుట్టినరోజు కదా బామ్మ గారు మీకోసం నేను మంచిగా రెడీ చేస్తాను మిమ్మల్ని మరింత అందంగా రెడీ చేస్తానని అంటుంది.. అప్పుడే మౌనిక రావడం చూసి అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు.. మౌనిక నువ్వు వచ్చేసావా అని అంటుంది.. మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి పిలుచుకుని వస్తున్నారా అని ప్రభావతి రవి శృతిలను అడుగుతుంది.. మేము వాళ్ళ ఇంటికి వెళ్లడమా ఏం మాట్లాడుతున్నారంటే అని శృతి అంటుంది.
నువ్వు ఇంటికి పెద్ద కోడలు కదా అందుకే నువ్వు పద్ధతిగా వెళ్లి ఫోన్ చేసి పిలిచావు కదా అందుకని మౌనిక వచ్చింది అని రవి అంటాడు.. ఏంటి బాలు లేడని అతని పొజిషన్ నువ్వు తీసుకున్నవ్ ఏంటి సెటైర్లు వేస్తున్నావు అని రోహిణి అడుగుతుంది. మరి లేకపోతే ఏంటి వదిన నువ్వు ఏమైనా పిలిచావా గుడి దగ్గర కనిపిస్తే మేము బామ్మ పుట్టినరోజు అని తీసుకొని వచ్చాము అని అంటాడు.. అందరూ మౌనిక వచ్చిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంటారు..
రోహిణి సుశీలకు మేకప్ వేయాలని పైకి తీసుకుని వెళుతుంది. సుశీలకు మేకప్ వేస్తుంటే మీ నాన్న మీ అమ్మ ఫోటోలు అన్న చూపించు ఒకసారి ఎలా ఉంటారో చూస్తానని అడుగుతుంది.. అయితే రోహిణి మా అమ్మ అంటే నాకు ఎమోషన్ ఎక్కువ అందుకే ఆమె ఫోటో కూడా నేను పెట్టుకోలేదు అని అంటుంది. రోహిణి ఎలాగోలాగా మ్యారేజ్ చేసి తప్పించేసుకుంటుంది.. ఇక సుశీలను రోహిణి రెడీ చేసే కిందకు తీసుకురాగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. చాలా అందంగా ఉన్నారు మీరు ఇప్పుడు పాతకాల హీరోయిన్ లాగా ఉన్నారు అని అంటుంది.
Also Read : హీటేక్కిస్తున్న నామినేషన్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?
సుశీల పుట్టినరోజు వేడుకలకు బాలు రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇంటికి పంతులు రావడంతో సత్యం నీ సుశీల అడుగుతుంది.. ఏమైంది మన ఇంట్లో ఏమైనా పూజ ఉందా అంటే నీకోసమే అమ్మ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న కదా అందుకే వాళ్ళు వచ్చారు అని అంటాడు.. మొత్తానికి సుశీలను ఆ పంతులు వేదమంత్రాలతో ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి బామ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.. బాలు కోసం వెయిట్ చేస్తే ఈరోజు మొత్తం గడిచిపోతుంది అని మనోజ్ వెటకారంగా మాట్లాడుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..