Ayodhya ram mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం నిర్మాణాం కోసం భక్తులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి , 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు.
Poornima Kothari : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం ప్రారంభం కోసం భక్తులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు.
అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి తెలిపింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేదాటడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి, 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి అశువులు బాసారు.
తన ఇద్దరు తమ్ముళ్ల ప్రాణ త్యాగాలకు తగిన ఫలితం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తన జీవితంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను జీవితంలో ఎప్పటికి మర్చిపోనని ఆమె తెలిపింది. 33 ఏళ్ల క్రితం తన సోదరులు కళ త్వరలో నేరవేరబోతుందన్నారు. 2014 ముందు వరకు తన ఇద్దరు సోదరులు చేసిన ప్రాణ త్యాగం వృథా అయిందని చాలా సార్లు బాధపడినట్లు తెలిపింది. చివరకు ఆలయ నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
1990 వ సంవత్సరంలో కరసేవకులు చేపట్టిన యాత్రలో రామ్ కొఠారి, శరత్ కొఠారి కోల్ పాల్గొన్నారు. యాత్ర బెనారస్ వరకు చేరుకోగానే హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు యాత్ర చేసేవారిని నిలువరించారు . అయితే రామ్ కొఠారి, శరత్ కొఠారి బెనారస్ నుంచి టాక్సిలో ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో అల్లర్లు చెలరేగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామ్ కొఠారి , శరత్ కొఠారి ప్రాణాలు కోల్పోయారు.