DA Hike: దీపావళికి ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన అలవెన్స్ లు జులై 1, 2025 నుండి అమలులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
జీతాలు, పెన్షన్లలో డీఏ, డీఆర్ చాలా ముఖ్యమైనవి. కేంద్ర ప్రభుత్వం ఈ భత్యాలను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తుంది. జనవరి, జులై నెలల్లో డీఏ పెంపును ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తుంటారు. డీఏ పెంపు కోసం జులై నుండి ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచి అమలయ్యేలాగా మార్చి నెలలో డీఏ, డీఆర్ లను 2 శాతం పెంచింది. ఈ పెంపుతో బెసిక్ శాలరీలో డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఈ పెంపుదలను కేంద్రం ఆమోదించింది. ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు ఉపశమనం కల్పించడానికి డీఏ, డీఆర్ లను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం.
దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ(DA) 3% పెంపుతో 58%కి సర్దుబాటు ప్రతిపాదనను బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త డీఏ రేటు జులై 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. డీఏ, డీఆర్ పెంపుతో కేంద్రంపై రూ.10,084 కోట్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇటీవల రైల్వే ఉద్యోగుల బోనస్ ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మార్చి 2025లో జనవరి 1 నుండి డీఏ/డీఆర్‌ను 2 శాతం పెంచింది. ఈ సవరణతో శాలరీలో డీఏ 55 శాతానికి పెరిగింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచుతుంది. సాధారణంగా ఏడాదికి రెండుసార్లు జనవరి, జులైలో డీఏ సర్దుబాటు చేస్తుంది. అయితే ఈసారి డీఏ పెంపు ఆలస్యం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కంజ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI-IW) ఆధారంగా లెక్కిస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖలోని ఒక విభాగం, లేబర్ బ్యూరో, ప్రతి నెలా CPI-IW డేటాను ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపునకు ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది.
Also Read: LPG Cylinder Price: పండగ వేళ సిలిండర్ ధరలకు రెక్కలు.. ఆపై కేంద్రం మరొక శుభవార్త
7వ వేతన సంఘం ప్రకారం బెసిక్ శాలరీ రూ. 18,000 ఉన్న ఉద్యోగి నెలవారీ ఆదాయానికి 3% డీఏ పెరిగితే దాదాపు రూ. 540 జీతంలో యాడ్ చేస్తారు. అంటే వారి మొత్తం జీతం రూ. 28,440కి పెరుగుతుంది. రూ. 9,000 కనీస పెన్షన్ ఉన్న పెన్షనర్లకు అదనంగా రూ. 270 లభిస్తుంది. 58 శాతం డీఆర్ పెంపుతో మొత్తం పెన్షన్ రూ. 14,220కి చేరుతుంది.